Sidebar

11
Sun, May

చిత్తూరులో వార్డు వాలంటీర్ శరవణ ఆత్మ-హ-త్య వైసీపీలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇంట్లో ఉరేసుకుని శరవణ ఆ-త్మ-హ-త్య చేసుకున్నాడు. వైసీపీ నాయకుడి వేధింపులే కారణమని శరవణ సూ-సై-డ్ నోట్ బ‌య‌ట‌ప‌డ‌టంతో ఏం చేయాలో తెలియ‌క పోలీసులు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. చిత్తూరు నగరం 11వ డివిజన్‌కి చెందిన వార్డు వాలంటీర్ శరవణ అలియాస్ జలాల్  ఆ-త్మ-హ-త్య-కు వైసీపీ నేత‌లే కార‌ణ‌మ‌ని మ‌ర‌ణ‌వాంగ్మూలం వెల్ల‌డిస్తోంది. ఆ-త్మ-హ-త్యకి ముందు రాసిన‌ సూ-సై-డ్ నోట్‌లో త‌న చావుకి రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ అంజలి,ఎమ్మెల్యే అనుచరుడు సయద్ అని పేర్కొన్నాడు. త‌న దగ్గర  డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా తిప్పుతున్నార‌ని, అడిగితే వైసీపీ ఎమ్మెల్యే మ‌నుషుల‌మంటూ బెదిరించారని లేఖ‌లో రాశాడు. తీసుకున్న డ‌బ్బు ఎగ‌వేసేందుకు నా కుటుంబాన్ని ఏమైనా చేస్తామని బెదిరించ‌డం దారుణ‌మ‌ని లేఖ‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. పోలీసులు త‌న‌కు రావాల్సిన డబ్బులు వ‌సూలు చేసి త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ఇవ్వాలంటూ వాలంటీరు సూసైడ్ నోట్లో కోరాడు. శరవణ ఆ-త్మ-హ-త్య-కు కారణమైన వైసీపీ నేత‌ల‌ను అరెస్టు చేయాలంటూ గ్రామస్థులు ధర్నాకు దిగారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read