వాలంటీర్ వ్యవస్థను సన్మానించే కార్యక్రమాన్ని ప్రభుత్వంచేపట్టిందని, నిస్వార్థంగా పనిచేశారంటూ పూర్తిగా అధికారపార్టీకోసం పనిచేసినవారికి నేడు ముఖ్యమంత్రి అవార్డులుప్రదానం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆక్షేపించారు. సోమవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతినియోజకవర్గంలో 5 గురికి, మున్సిపల్ కార్పొరేషన్ కి 10మంది చొప్పున ఎంపికచేసి, వారికి రూ.20వేలచొప్పున అందించార న్నారు. 2లక్షల18వేల119మంది వాలంటీర్లకు రూ.10వేలచొప్పున అందించారన్నారు. వాలంటీర్ల స త్కారంపై అనేకప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. అవార్డ్ అనేది ఏఒక్కరికో, ఇద్దరికో ఇస్తారని, అలాకాకుం డా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న 2లక్షల49వేలమంది వాలంటీర్లలో, 2లక్షల22వేల990మందికి అవార్డులు ఇవ్వడంపై ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. అవార్డ్ అనే పదానికి సరికొత్త జస్టిఫికేషన్ ఇచ్చారన్నారు. వాలంటీర్ల సత్కారానికి రూ.228కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వం ప్రజలకు చెప్పిం దన్నారు. దాదాపు పది పత్రికలలో ఇందుకోసం భారీ ప్రకటనలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతిపనికి ప్రచారం చేసుకోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నా రు. ప్రజలకుచేసే సేవకోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని, దాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో చెప్పడం జరిగిందన్నా రు. వాలంటీర్లను నియమించినప్పుడు వారిని ప్రభుత్వో ద్యుగులుగా చెప్పి, దాదాపు 4లక్షల ప్రభుత్వ ఉద్యోగా లుఇచ్చినట్టు ఈప్రభుత్వం ఘనంగా చెప్పుకుందన్నా రు. వాలంటీర్లు జీతాలు పెంచాలని...లేకుంటే సమ్మె చేస్తామని చెప్పినప్పుడు, వారు ప్రభుత్వ ఉద్యోగులు కారు, వారితో సేవచేయించుకుంటున్నాము.. గౌరవ వేతనంగా రూ.5వేలిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం గా చెప్పడం జరిగిందన్నారు. విజయసాయిరెడ్డి గతంలో ఒక సందర్భంలో మాట్లాడుతూ, వాలంటీర్ వ్యవస్థను పార్టీకోసమే తయారుచేశామని, 90శాతం వరకు వైసీపీ వారే దానిలోఉన్నారని చెప్పడం జరిగిందన్నారు.

వాలంటీర్ వ్యవస్థ రూపంలో 4లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ను సృష్టించామని జగన్ ప్రభుత్వంచెప్పిందంతా అబద్ధ మని ఆయన మాటలతోనే తేలిపోయిందన్నారు. వాలం టీర్లుగా పనిచేసేవారుసేవాధృక్పథంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చెబితే, పార్టీకార్యకర్తలకోసం ఆ వ్యవస్థను సృష్టించామని విజయసాయిరెడ్డి పేర్కొన్నడన్నారు. వాలంటీర్ వ్యవస్థ ముసుగులో ప్రజలకు సేవ చేస్తున్నా రని చెప్పుకుంటూ, ప్రభుత్వం అధికారపార్టీకి అనుకూ లంగా పనిచేసే ఒకవ్యవస్థను తయారుచేసిందని అశోక్ బాబు తేల్చిచెప్పారు. వాలంటీర్ల సత్కారకార్యక్రమానికి రూ.228కోట్లు ఖర్చయినట్లు చెప్పుకుంటూనే, వారికి నేడు ఇచ్చినసొమ్ము రూ.261కోట్లుగా చెప్పడం జరిగిం దన్నారు. మిగిలిన రూ.32కోట్ల సొమ్ము పైఖర్చులని చెబుతూ, ప్రభుత్వం ప్రజలసొమ్ముని తగలేసిందన్నా రు. వాలంటీర్లకు తొలుత రూ.8వేలు ఇస్తామనిచెప్పిన ముఖ్యమంత్రి , ఆ మొత్తాన్ని రూ.5వేలకే పరిమితం చే శాడన్నారు. జీతాలు పెంచమని డిమాండ్లు రావడంతో వారిని సేవచేసే వారిగానే చూస్తున్నామని, గౌరవ వేతనంగా రూ.5వేలేచెల్లిస్తామని చెప్పడంతో వాలంటీర్ల లో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ వ్యతిరేకతను చల్లార్చడానికి, వాలంటీర్లను బుజ్జగించ డానికే ప్రభుత్వం ఉగాదిపురస్కారాల పేరుతో వారికి కనీసంగా రూ.10వేలసొమ్ముని అందించిందన్నారు. వజ్రం, రత్నం, సేవామిత్ర అంటూ మూడు కేటగీరీలుగా వాలంటీర్లను విభజించిన ప్రభుత్వం, వారికి పురస్కారా లు అందించిందన్నారు. ఏకమిటీలు వేసి, ఏ నిబంధనల ప్రకారం వాలంటీర్లనుమూడు కేటగిరీలుగా విభజించారో సమాధానంచెప్పాలని టీడీపీఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ఏడాదినుంచి పనిచేసి, ఎక్కడా అవినీతికి పాల్పడకుండా ఉన్నవారిని రూ.10వేలకేటగిరీలోకి ఎంపిక చేశారన్నారు. వాలంటీర్లకు జీతాలు పెంచడంలో చట్టబద్ధమైన ఇబ్బందులున్నందున, ప్రభుత్వం ఈవిధం గా దొడ్డిదారిన ఉగాదిపురస్కారాలపేరుతో వారికి డబ్బు లిచ్చిందన్నారు.

ప్రతిఏటా ఉగాదినాడే సొమ్ము అంద చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందన్నా రు. ఏటా రూ.261కోట్లచొప్పున మూడేళ్లలో రూ.750కో ట్లనువాలంటీర్లకు ఇవ్వడంతోపాటు జీతాలపేరుతో కొన్ని వేలకోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సేవకు అందిస్తున్న ట్లు చెప్పుకుంటోందన్నారు. కానీవాస్తవంలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోందన్నారు. జగనన్న రుణం తీర్చుకునే అవకాశం వాలంటీర్లకు వచ్చిందని, వాలంటీ ర్లు పార్టీ గెలుపుకోసం పనిచేయాలని సాక్షాత్తూ అధికార పార్టీఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా బెదిరింపుల కు దిగడం జరిగిందన్నారు. మాటవినని వాలంటీర్లను అకారణంగా ప్రభుత్వపెద్దలు తొలగించిన సందర్భాలు కోకొల్లలని అశోక్ బాబు తెలిపారు. బలవంతంగా వాలం టీర్లతో ప్రభుత్వం, వైసీపీకోసం వినియోగిస్తోందన్నారు. వాలంటీర్ల నియామకంలోకూడా ఎక్కడా నిబంధనలు పాటించలేదన్నారు. వాలంటీర్లమంటూ వారుచేసే ఆగ డాలు, అకృత్యాలనుకూడా ప్రభుత్వం నిలువరించడం లేదని అశోక్ బాబు తేల్చిచెప్పారు. పింఛన్, రేషన్ కార్డు ,ఇళ్లస్థలాల వంటివాటికోసం ప్రజలనుంచి అందినకాడికి వసూలుచేసిన వాలంటీర్లు కూడా ఉన్నారన్నారు. ముందు డబ్బులిస్తేనే, మీకు పనిచేస్తామంటూ కొందరు వాలంటీర్లు ఇప్పటికీ చెబుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వం 10-04-2021న ఇచ్చిన జీవో నెం-1054 లో వాలంటీర్లకోసం రూ.261కోట్లు వెచ్చిస్తు న్నట్లు స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఈ విధంగా ప్రభుత్వమే సత్కారాలు, పురస్కారాల పేరుతో దొడ్డిదారి న వాలంటీర్లకు లంచాలు ఇచ్చిందని అశోక్ బాబు మం డిపడ్డారు. ప్రభుత్వమే నేరుగా ఈ విధంగా లంచాలివ్వ డం సిగ్గుచేటన్నారు. పనివాళ్లు, ఉద్యోగులుకాని వాలం టీర్లకు ఈ విధంగా లంచాలివ్వడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నిజంగా వాలంటీర్లను సన్మానించా లనుకుంటే, వారిలో నిజాయితీగా, పట్టుదలతో పనిచేసే వారికి పురస్కారాలు ఇచ్చిఉండాల్సిందన్నారు. వైసీపీ ని బతికించుకోవాలన్న దురాలోచనతో ప్రభుత్వమే వా లంటీర్ వ్యవస్థను పెంచిపోషిస్తోందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read