ఈ మధ్య కాలంలో, ఎన్నికలు అంటే కామెడీ అయిపోయాయి. మొన్నటి వరకు రిగ్గింగ్ లాంటివి చూసే వాళ్ళం. తరువాత కాలంలో, ఈవీయంలు రావటంతో, రిగ్గింగ్ సంస్కృతీ చాలా వరకు తగ్గింది. తరువాత ఈవీఏం ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ జరిగినా, ఏదో ఒక చిన్న స్థాయిలో, ఎవరికి చేతనైనట్టు వాళ్ళు చేసే వాళ్ళు. ఇప్పుడు తాజాగా ట్రెండ్ మారింది. మొన్న తిరుపతి ఉప ఎన్నికలో, కుప్పం ఎన్నికలో జరిగిన దొంగ ఓట్ల దండయాత్రను చూసి, దేశం కూడా షాక్ అయ్యింది. ఈ దొంగ ఓట్ల దందా ఎలా జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వక మానదు. ముందుగా వాలంటీర్లు ఇంటి ఇంటికీ తిరుగుతారు. చనిపోయిన వారి వివరాలు, అలాగే అక్కడ నుంచి వెళ్ళిపోయిన వివరాలు సేకరిస్తారు. వాళ్ళ పేర్లతో దొంగ ఓటర్ ఐడి కార్డులు సృస్టిస్తారు. అలాగే మరి కొంత మంది ఉంటారు. తమ ప్రత్యర్ధి పార్టీ అనుకునే వారి వివరాలు తీసుకుంటారు. వాళ్ళ పేర్లతో కూడా దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టిస్తారు. ఓటింగ్ రోజు, ఈ ఓట్ల అన్నీ పక్క ఊళ్ళ నుంచి, ఓటర్లను తీసుకు రావటంతో మొదలు అవుతుంది. తీర్దయాత్రలకు అని బస్సుల్లో వేసుకుని వస్తారు. ముందు రోజు రాత్రి కళ్యాణమండపాల్లో ఉంచుతారు. ఎన్నికల రోజున, ఈ ఓటర్లను మొదటి గంటలోనే ఓట్లు వేయించేలా ప్లాన్ చేస్తారు.

voter 20122021 2

నిజమైన ఓటర్ వచ్చే సరికే, ఓటు నమోదు అయి ఉంటుంది. అలాగే చనిపోయిన వారి ఓట్లు అయితే ఆడిగే వారే ఉండరు. మరి అక్కడ ఉండే ప్రత్యర్ధి పార్టీ ఏజెంట్లు ఏమి చేస్తున్నారు అంటే ? వారిని బెదిరిస్తారు, లొంగ దీసుకుంటారు, ఎదిరిస్తే పోలీసులు వచ్చి ఏదో ఒక పేరు చెప్పి తీసుకుపోతారు. ఇలా దొంగ ఓట్లు గుద్దుకుంటూ ఎన్నికలు గెలవటం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో, ఈ దొంగ ఓటర్లకు చెక్ పడింది అనే చెప్పాలి. కనీసం ఈ దొంగ ఓటర్ ఐడి కార్డులు అయినా తగ్గుతాయి. నేడు లోక్ సభ ముందుకు ఎన్నికల చట్టాల బిల్లు-2021ని కేంద్రం ప్రవేశ పెడుతుంది. ఈ బిల్లును లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇందులో భగంగా, ఓటరు జాబితాలో డుప్లికేషన్ నివారించే దిశగా కీలక నిర్ణయం తీసుకుని. కొత్త ఓటర్ల గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్ వినియోగం పరిగణలోకి తీసుకోనున్నారు. ఓటర్ కార్డుని, ఆధార్ తో అనుసంధానం చేస్తారు. అయితే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు, దొంగ ఓట్ల బ్యాచ్, దీన్ని ఏమి చేస్తుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read