ఏపీలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇంకా ఓటర్లు బారులు తీరారు. చాలా ప్రాంతాల్లో ఓటర్లు భారీగా క్యూలో ఉన్నారు. ఆరేడు గంటలుగా క్యూలైన్లలో ఓటర్లు వేచివున్నారు. ఓటు వేశాకే తిరిగి వెళ్తామని ఓటర్లు చెబుతున్నారు. చాలా చోట్ల రాత్రి అయినా పోలింగ్ జరుగుతుంది. ఉదయం ఈవీయంలు మొరాయించటంతో, వెనుతిరిగిన వారు, మళ్ళీ వచ్చి లైన్ లో నుంచుని ఓటు వేస్తున్నారు. 6 గంటల లోపే లైన్ లో ఉండటంతో, వారందరినీ ఓటు వేసేలా ఏర్పాటు చేసారు. లైటింగ్ లేని చోట్ల లైట్లు పెట్టారు. ఓటు వెయ్యకుండా వెనుతిరిగిన వారు, వచ్చి ఓటు వెయ్యాలని చంద్రబాబు పిలుపు ఇవ్వటంతో, చాలా మంది మళ్ళీ వచ్చి ఓటు వేస్తున్నారు. అయితే, ఇలా వెళ్ళిపోయిన వారు, మళ్ళీ వచ్చి ఓటు వెయ్యటం ఎప్పుడూ చూడలేదని విశ్లేషకులు అంటున్నారు.

vote 11042019

మరో పక్క, ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా, సజావుగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మొత్తం 381 ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని, వాటన్నింటికీ మరమ్మతులు చేయించినట్టు చెప్పారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఒకరికి ఓటు వేస్తే మరొకరికి వెళ్లింది అనేవన్నీ వదంతులేనని స్పష్టంచేశారు. ఈ విషయంపై ఏ ఒక్కరి నుంచి కూడా అభ్యంతరాలు రాలేదన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కలిపించమని స్పష్టంచేశారు. గడువులోపు వచ్చిన వారికి ఎంత రాత్రి అయినా ఓటు వేసే అవకాశం ఇస్తామన్నారు. మాక్ పోలింగ్లో అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి 6 ఘటనలు మా దృష్టికి వచ్చాయి. రిపోలింగ్ అంశంలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్ల ద్వారా సమాచారం తీసుకొని నిర్ణయం తీసుకుంటాం. పూతాలపట్టు నియోజకవర్గంలో మూడు గంటలకే పోలింగ్ నిలిచిపోయింది.

vote 11042019

క్యూలో ఉన్నవారు ఓటింగ్ ఎంత సమయం పట్టిన ఓటు వేసుకొనే అవకాశం కల్పించాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు జరగలేదు. ఎన్నికల బందోబస్తుకు కేంద్ర బృందాలు ఎందుకు రాలేదనే విషయంపై నేను ఏమి చెప్పలేను. హింసాత్మక ఘటనలు ఎందుకు జరిగాయనే విషయంపై విచారణ చేపట్టాం. రీపోలింగ్ కు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలు అక్కడ ఉన్న సిబ్బంది ద్వారా నిర్ణయం తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందని ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదు. పోలింగ్ కు సంబంధించి సిబ్బంది తప్పులు ఉంటే కలక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నేతలు చేసే కామెంట్స్ పై నేను ఏమి మాట్లాడను. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ పూర్తిగా సంతృప్తిగా ఉంది. ఫార్మ్ 17A ద్వారా రిపోలింగ్ పై నిర్ణయం తీసుకుంటాం అని ఆయన అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read