ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవడైనా శత్రువు అనే వాడు ఉన్నాడు అంటే, మొదటి వరుసలో ఉండేది ఈ హైదరాబాద్ మీడియా... హైదరాబాద్ లో కూర్చుని, అమరావతిలో జరిగేవాటి మీద, హైదరాబాద్ లో ఉండే కోడి బుర్ర గాళ్ళను తీసుకువచ్చి, మన సమస్యల మీద విషం చిమ్మిస్తారు... కాని మన విజయాలు మీద ఒక్క ప్రోగ్రాం ఉండదు, ఒక్క చర్చ ఉండదు... సాక్షాత్తు రాష్ట్రపతి మెచ్చుకుంటే, ఒక వార్తా కూడా వెయ్యరు.... ఎంత సేపు మన మీద ఏడవటమే ఈ హైదరాబాద్ మీడియా పని... హైదరాబాద్ లో ఉండి ఏ నాడైనా తెలంగాణా సమస్యల మీద చర్చలు పెడతారా అంటే ? అమ్మో భయం... మా వాడు, 10 కిమీ లోతులో పాతేస్తాడు... చంద్రబాబు అయితే ఏమి అనడు, అందుకే ఇక్కడ మా ఆటలు సాగుతుయ్యి అంటారు... VRO వనజాక్షి గుర్తుందా.. మనం బ్రతికి ఉన్నంత వరకు గుర్తు ఉంటుంది... అలా చేసింది హడావడి, ఈ హైదరాబాద్ మీడియా... ఇవాళ తెలంగాణాలో ఏమి జరిగిందో తెలుసా... ఇసుక అక్రమ రవాణా చేస్తున్నందుకు ఆపాడు అని, ఒక వీఆర్ఏను చంపేశారు... ఎవరికి అయినా ఈ విషయం తెలుసా ? ఇదే ఆంధ్రాలో జరిగితే ఈ పాటికి ఈ హైదరాబాద్ మీడియా ఏమి చేసేది ?

media 0501218 2

వివరాలు ఇలా ఉన్నాయ్.. కామారెడ్డిలో ఇసుకమాఫియా రెచ్చిపోయింది. ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు వీఆర్ఏను ఇసుకమాఫియా చంపేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని పిట్లం మండలం కంబాపూర్ గ్రామశివారులో కాకివాగు వద్ద నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్ఏ సాయిలు అక్కడకు చేరుకున్నాడు. ఇసుక తరలిస్తున్న మాఫియాను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇరువురికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఇసుక మాఫియా వీఆర్ఏ సాయిలు పైనుంచి ట్రాక్టర్‌ను తీసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు.

media 0501218 3

కారెగాం గ్రామానికి చెందిన సాయిలు మార్తాండ గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు సమాచారం ఇచ్చిన అనంతరం సాయిలు ఘటనాస్థలికి వెళ్లినట్లు తెలుస్తుంది. వీఆర్‌ఏ సాయిలు చనిపోయిన విషయం తెలుసుకు కారెగాం, మార్తాండ గ్రామస్థులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. సమాచారం అందిన వెంటనే స్థానిక ఎమ్మార్వో, పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు గ్రామాల ప్రజలను శాంతింపజేసేందుకు యత్నిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read