కొన్నాళ్లుగా తాడేపల్లి ప్యాలెస్‌లోకి ఎంట్రీ కూడా బంద్ అయిన విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఒకానొక దశలో బీజేపీలో చేరిపోతారని కూడా సాయిరెడ్డిపై ప్రచారం సాగింది. విజయసాయిరెడ్డి నుంచి ఉత్తరాంధ్ర బాధ్యతలు మొదట పీకేశారు. ఢిల్లీ వైసీపీ కోఆర్డినేటర్ గా తప్పించేశారు. సోషల్ మీడియా ఇన్చార్జిగా పీకేశారు. వైసీపీ అనుబంధ సంఘాల బాధ్యతలు ఇచ్చినట్టే ఇచ్చి చెవిరెడ్డికి అప్పగించేశారు. అప్పటి నుంచి తాడేపల్లి ప్యాలెస్‌లోకి, ఇటు తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి కూడా సాయిరెడ్డికి ఎంట్రీ బంద్ అయ్యింది. ఏమైందో ఏమో కానీ సోషల్‌మీడియాలో కూడా పతివ్రత పరమాన్నం వండినట్టు ట్వీట్ల భాష కూడా సాంప్రదాయకంగా మారిపోయింది. ఇదే సమయంలో సాయిరెడ్డికి అల్లుడు తారకరత్న మరణం మరింత చిక్కుల్లోకి నెట్టేసింది. తన అల్లుడి మరణం సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు, బాలయ్యలతో ఉండటమేకాదు, వారిని పొగడాల్సి వచ్చింది. ఈ కారణంగానే సాయిరెడ్డిని జగన్ రెడ్డి టార్గెట్ చేశారనే రూమర్లు వచ్చాయి. కానీ ఇదేది కాదు. ఏదో వ్యూహాత్మక ఎత్తుగడ అని ఇప్పుడు అర్థమైంది. తన అల్లుడు అన్న శరత్ చంద్రారెడ్డిని ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్ గా మార్చి జగన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని వివేకానందరెడ్డి హత్యకేసు నుంచి కాపాడడంలో సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అంటే ఇన్నాళ్లూ కామ్‌గా ఉన్నది జగన్ రెడ్డితో విభేదాల వల్ల కాదని, ఢిల్లీ స్థాయిలో పెద్దలని, లాబీయిస్టులని దింపి వ్యవస్థల మేనేజ్ చేస్తూ ..చాలా కేసుల్నించి జగన్ రెడ్డిని కాపాడడంలో తెరవెనుక సూత్రధారి సాయిరెడ్డి అని తెలుస్తోంది. ఇంకా తెరవెనుక డ్రామాలు కట్టిపెట్టి మళ్లీ సాయిరెడ్డి తెరపైకి వచ్చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళ, యువజన, విద్యార్ధి విభాగాల ఆధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో విడివిడిగా సమావేశాలు జరిగాయి. జోనల్ స్థాయిలో పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సోషల్ మీడియాలోనూ మళ్లీ రోత ట్వీట్లు వేస్తూ తాను మారలేదని, మారినట్టు నటించానని నిరూపించుకున్నారు విజయసాయిరెడ్డి.
విజయసాయిరెడ్డి మళ్లీ వచ్చాడా? రప్పించారా?
Advertisements