ఎన్నికల కమిషన్ నిబరధనల అమలుపై వస్తున్న ఫిర్యాదులతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఏ పనిచేయాలో.. ఏది చేయకూడదో అర్ధంకాక అయోమయంలో పడుతున్నారు. దిగువస్థాయి అధికారుల నుండి కొన్ని శాఖల్లో ఉన్నతస్థాయి వరకు ఈ పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రభుత్వంలో ఉన్న నాయకుల నుండి వస్తున్న ఒత్తిడి ఒకవైపు, ప్రతిపక్ష పార్టీ నుండి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల మరోవైపు పెరగుతుండటంతో అధికార యంత్రాంగం తీవ్రస్థాయిలో ఒత్తిడికి గురవుతుంది. ' ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు' అని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. సిఎం హోదాలో చంద్ర బాబు నిర్వహించిన సమావేశానికి హాజరైన అధికారులకు నోటీసులు జారీ కావడం ప్రారంభం కావడంతో ఈ ఆందోళన మరింత పెరుగుతోంది.
వైసిపి ఇస్తున్న ఫిర్యాదులపై ఇసి స్పందిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. నాలుగురోజుల క్రితం వైసిపి నేత విజయసాయిరెడ్డి చేసిన ఒక ఫిర్యాదులో వివిధ అంశాలను ప్రస్తావించారు. దీనికి సంబంధించి. ఆర్ధికశాఖ, హౌరశాఖ, ఐటి శాఖ, కృష్ణా, గురటూరు జిల్లాల కలెక్టర్ల వివరణను ఇసి కోరింది. ప్రధానంగా తమ పార్టీ అభ్యర్ధిపై పూతలపట్టులో జరిగిన దాడిదగ్గరనురచి, సత్తెనపల్లిలో తెలుగుదేశం అభ్యర్ధిపై ఆరోపణలు, ఇవిఎంలు భద్రపరిచిన ప్రారతాల్లో సిసి కెమేరాలు, భద్రతపైనా ఆయన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై తక్షణమే పరిశీలిరచి సమాధానం చెప్పాలని 16వ తేదీన సిఎస్‌కు ద్వివేదీ నురచి లేఖ వెళ్లిరది. దీనిపై 17వ తేదీనే స్పరదిరచిన సిఎస్ సంబంధిత శాఖలకు సర్క్యులర్లు జారీ చేయడం గమనార్హం.
అదే విధంగా ఓవర్‌డ్రాఫ్ట్, పథకాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలను ఆయన ఫిర్యాదులో పేర్కొన్పారు. దీనికి సంబంధించి గత ఆర్ధిక సంవత్సరం చివరిలో పేరుకుపోయిన భారీ బిల్లులను చెల్లిరచేరదుకు ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లినట్లు వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే ఆర్ధికశాఖ అధికారులు సిఎస్‌కు నివేదిక సమర్పిరచారు. ఇతర శాఖలు కూడా తమ శాఖలకు సంబంధిరచిన ఫిర్యాదులపై నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసిరది. సిసి కెమేరాలు, అదనపు భద్రతపై తీసుకురటున్న చర్యలపై హౌరశాఖ అధికారులు కూడా వివరాలు సమర్పిరచేరదుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్‌నుండి వస్తున్న లేఖలు. వాటికి సమాధానాల తయారుచేసే హడావిడిలో సచివాలయంలోని అనేక శాఖల అధికారులు కనపడుతున్నారు.