విజయసాయి రెడ్డి చాలా రోజుల తరువాత బయటకు వచ్చారు. ట్విట్టర్ లో కూడా ప్రతి రోజు చంద్రబాబు, లోకేష్ పై విరుచుకు పడే విజయసాయి రెడ్డి, గత రెండు నెలలుగా ఎందుకో కానీ సైలెంట్ అయ్యారు. ఏమి అయ్యిందో, ఎవరు సెటిల్ చేసారో కానీ, ఆయన ఎట్టకేలకు మళ్ళీ ఫాంలోకి వచ్చారు. గతంలో శ్రీవారి నగలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని, అలాగే వివేకకు గుండెపోటు వచ్చి చనిపోయారని, ఇలా అనేక తప్పుడు ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డి, మళ్ళీ అవే తప్పుడు ఆరోపణలతో ముందుకు వచ్చారు. తాము అధికారంలో ఉన్నామనే స్పృహ కూడా లేకుండా, ఇంకా ఇలా గాలి మాటలు చెప్తూ, ప్రజల్లో విష బీజాలు నాటుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి తోడుగా చంద్రబాబు గారికి అమిత్ షా అపాయింట్మెంట్ లేట్ అవ్వటంతో, ఇంకేముంది, పండుగ చేసుకున్నారు. చంద్రబాబుని, లోకేష్ ని తిట్టేసారు. ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసారు. గంజాయి మొత్తం లోకేష్ చేస్తున్నారని చెప్పేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ, గంజాయి విషయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి, ఏపి నుంచి వస్తున్న గంజాయి పై చెప్పుకొచ్చారు.
ఈ వీడియోలు అన్నీ లోకేష్ నాలుగు రోజులు క్రితం పోస్ట్ చేసారు. నల్గొండ ఎస్పీ, హైదరాబాద్ సిపీ, ఢిల్లీ డీసిపీ, కేరళ పోలీస్ అధికారి, బెంగుళూరు పోలీస్ కమీషనర్, ఇలా పెద్ద పెద్ద ఐపిఎస్ లు అందరూ, గంజాయి ఎక్కడ నుంచి వస్తుంది అంటే, ఏపి నుంచి అనే విధంగా చెప్పారు. ఈ వీడియో బలంగా ప్రజల్లోకి వెళ్ళటంతో, దీనికి కౌంటర్ ఇవ్వటానికి విజయసాయి రెడ్డి వ్యూహం పన్నారు. యధావిధిగా, దీని వెనకాల చంద్రబాబు ఉన్నారు అంటూ, వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ సరిహద్దు జిల్లాలో ఉండే ఒక పోలీస్ అధికారి చంద్రబాబుకు బాగా కావలసిన మనిషి అని, టిడిపితో బాగా అనుబంధం ఉందని, ఈ అధికారే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు చెందిన తన సహచర పోలీసులతో కలిసి, ఏపిలో గంజాయి ఉంది అనే విధంగా ప్రచారం చేసారు అంటూ, విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ తెలంగాణా పోలీస్ అధికారి పై, కేసీఆర్ కు కూడా ఫిర్యాదు చేస్తానని అన్నారు. అయితే ఇది సాదా సీదా ఆరోపణ కాదు, ఇలాంటి ఆరోపణల మరి కేసీఆర్ కానీ, తెలంగాణా పోలీస్ అధికారులు కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సమాధానం చెప్పలేక, విజయసాయి రెడ్డి ఇలా ఎప్పటిలాగే చంద్రబాబు మీద తోసేసాడా, లేకపోతే, ఇందులో వాస్తవం ఏమిటి అనేది తెలంగాణా ప్రభుత్వం తేల్చి చెప్పాలి.