రాష్ట్రపతి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపితే తీర్మానంలో, ఈ రోజు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ నుంచి విజయసాయి రెడ్డి మాట్లాడారు. అయితే అదే సందర్భంలో, అక్కడ హోం మంత్రి అమిత్ శ ఆన్నారు. ఒవైసీ పైన అటాక్ గురించి, రాజ్యసభలో ప్రకటన చేయటానికి వచ్చారు. అదే సందర్భంలో అక్కడ విజయసాయి రెడ్డి మాట్లాడాల్సి రావటంతో, బీజేపీ పైన పై పైన ఆరోపణలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ, టిడిపి పై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా గురించి పెద్ద లెక్చర్ ఇస్తున్న సమయంలో, విజయసాయి చుట్టూ ఉన్న ఇతర రాష్ట్ర ఎంపీలు విజయసాయి రెడ్డి స్పీచ్ ని నవ్వుతూ కామెంట్స్ చేస్తూ కామెడీ చేసారు. విజయసాయి రెడ్డి ప్రత్యేక హోదా గురించి అడుగుంటే, వాళ్లతోనే ఉన్నారుగా అని ఒకరు, కేరళ ఎంపీ అయితే, అమిత్ షా గారు ఈ గోల ఏంటో చూడండి అంటూ కామెడీ చేసారు. దీంతో సీరియస్ గా మొదలు పెట్టిన విజయసాయి రెడ్డి స్పీచ్ కామెడీ అయి కూర్చుంది. చంద్రబాబు మీద ఆరోపణలు చేయటం, కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయటం, సర్ సర్ అంటూ వేడుకోవటంతో, అందరి ముందు విజయసాయి రెడ్డి కామెడీ అయ్యారు. ఈ మొత్తం, అమిత్ షా ఒక పక్క నుంచి సీరియస్ గా చూస్తూనే ఉన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా అజెండాతో వచ్చింది. ఎన్నికల్లో గెలిచింది. గెలవగానే జగన్ ఢిల్లీ వెళ్లి, ప్లీజ్ సార్ ప్లీజ్ అని అడగటం తప్ప, మెడలు వంచేది లేదని చెప్పేసారు. అప్పటి నుంచి ప్లీజ్ సార్ ప్లీజ్ దగ్గరే వ్యవహారం ఉంది. మొన్నటి వరకు ఏదో వార్తల కోసం అయినా మాట్లాడే వారు, ఈ సారి పార్లిమెంట్ లో అది కూడా లేదు. మార్గాని భారత్, వంగా గీత మాట్లాడుతూ, అసలు ప్రత్యేక హోదా గురించి మర్చిపోయారు. తరువాత టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అందుకుని, అసలు వైసీపీ నేతలు స్పెషల్ స్టేటస్ తో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు అది మర్చిపోవటం, ఆశ్చర్యంగా ఉందని అన్నారు. దీంతో ఈ వార్త వైరల్ అవ్వటంతో, ఈ రోజు రాజ్యసభలో ఈ వ్యవహరం పై విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, కవరింగ్ ఇద్దాం అని అనుకున్నారు. అయితే వీళ్ళ కధలు అక్కడ ఢిల్లీలో అందరికీ తెలుసు కాబట్టి, అమిత్ షా ముందు విజయసాయి రెడ్డి భయపడుతూ ఇచ్చిన స్పీచ్ కి, అందరూ కామెడీ చేసి పడేసారు. ఇలా ఉంటాయి అండి, మెడలు వంచే వ్యవహారాలు.