వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పటి నెంబర్ టు విజయసాయి రెడ్డికి ఈ మధ్య పార్టీలో హోల్డ్ పోయింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, మొత్తం నాదే అనుకున్నారు. వెంటనే విజయసాయికి చెక్ పెట్టటానికి సజ్జల రామకృష్ణా రెడ్డిని దించారు. దీంతో రాష్ట్రం మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. జగన్ ఎంత బలమైన వాడో, సజ్జల కూడా అంతే బలమైన వ్యక్తిగా పార్టీలో పేరు తెచ్చుకున్నారు. మొత్తం నాదే అనుకున్న విజయసాయి రెడ్డిని కేవలం ఉత్తరాంధ్రకు పరిమితం చేసారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి కూడా గెంటేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. రాజ్యసభ సీటు రెన్యువల్ కూడా జరగదనే ప్రచారం జరుగుతుంది. విజయసాయి రెడ్డి ఇక నెమ్మదిగా కనుమరుగు అయిపోవాల్సిందే అనే కామెంట్స్ వినపడ్డాయి. దీనికి తగ్గట్టే విజయసాయి రెడ్డి గత రెండు నెలలుగా సైలెంట్ అయిపోయారు. అయితే ఏమైందో ఏమో, సెటిల్మెంట్ జరిగిందో ఏమో కానీ, విజయసాయి రెడ్డి ఉన్నట్టు ఉండి నిన్న బయటకు వచ్చారు. ఒక భారీ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో, చంద్రబాబుని, లోకేష్ ని ఉతికి ఆరేసారు. అంతే కాదు గంజాయి మొత్తం లోకేష్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అంటూ, తమ ప్రభుత్వం అధికారంలోనే ఉంది అనే సోయ కూడా లేకుండా, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసారు.

vsreddy 28102021 2

అసలు చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వచ్చారు, ఆ బూతులు ఏమిటి అంటూ,పట్టాభి అన్న ఆ ఒక్క మాట పట్టుకుని, నానా రభసా చేసారు. అసలు తమ పార్టీ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తమ పార్టీకి చంద్రబాబుకి పోలికే లేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. విలేఖరులు సమావేశం కావటంతో, విజయసాయి రెడ్డి పప్పులు ఉడక లేదు. ఒక విలేఖరి మాట్లాడుతూ, మీరేమన్నా తక్కువ తిన్నారా, జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, మీ పార్టీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా అంటూ, వాటి పై సమాధానం చెప్పండి అనగానే, విజయసాయి రెడ్డి ఫీజులు ఎగిరి పోయాయి. తనకు అవేమి గుర్తు లేవని, వాళ్ళు ఆ వ్యాఖ్యలు ఎప్పుడు చేసారు, డేట్, టైం , ప్లేస్ ఇవన్నీ చెప్పి, ఆ వివరాలు అడిగితే, తాను స్పందిస్తాను అని, ఊరికే అడిగేస్తే తనకు ఆ వివరాలు తెలియదు అని, టైం, ప్లేస్ చెప్పి ప్రశ్నలు అడగాలి అంటూ, సమాధానం చెప్పలేక నెమ్మదిగా జారుకున్నారు. విజయసాయి రెడ్డిని మొత్తానికి, విలేఖరులు తమ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టటంతో, విజయసాయి రెడ్డి బిత్తర పోయారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు - https://www.facebook.com/SaahoChandrababu/videos/1047210066055202

Advertisements

Advertisements

Latest Articles

Most Read