ఢిల్లీలో వైసీపీకి చెందిన ఏ పనైనా ముందు కనిపించేది ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏ అంశం మీదైనా వినిపించే సాయిరెడ్డి గొంతు మూగబోయింది. వైసీపీ తరఫున ఢిల్లీలో అన్నీ తానై వ్యవహారాలు చక్కబెట్టిన విజయసాయిరెడ్డి అన్ని పోస్టులతోపాటు ఢిల్లీ బాధ్యతలు పీకేశారని తెలుస్తోంది. కేంద్రంతో లాబీయింగ్, ఢిల్లీ వ్యవహారాలన్నీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డికి అప్పగించారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మిధున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలనుకుని తండ్రి పెద్దిరెడ్డితో కలిసి మళ్లీ తన సీటుకే ఎసరు పెడతారనే డౌటుతో నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపారు వైఎస్ జగన్ అని ప్రచారం జరుగుతోంది. కేంద్రం వైసీపీకి కొద్దిగా దూరం పెడుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో తనను జైలుకి పంపితే తన భార్య భారతి కాకుండా మంత్రి పెద్దిరెడ్డి బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తారనే భయం మొదటి నుంచీ జగన్ రెడ్డిని వెంటాడుతోంది. అందుకే సాయిరెడ్డి ప్లేసులో తెలంగాణకి చెందిన నిరంజన్ రెడ్డికి ఢిల్లీ బాధ్యతలు అప్పగించారని వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డికి ముందుగా ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా తప్పించారు. ఆ తరువాత సోషల్మీడియా ఇన్చార్జి నుంచి పీకేశారు. అనుబంధాల సంఘాల ఇన్చార్జి పోస్టూ పీకేశారు. ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు చూసే ఈ చివరి బాధ్యతని లాగేసుకుని రాజ్యసభ ఎంపీ, జగన్ కేసులు చూసే లాయర్ నిరంజన్ రెడ్డికి అప్పగించారు.
విజయసాయి ఢిల్లీలో చూసే బాధ్యతలు, ఆ వ్యక్తికి అప్పజెప్పారా ?
Advertisements