కియా. ఎవరు తెచ్చినదయా. అంటే చదువుకోని పిల్లాడినడిగినా ఠక్కున చెబుతాడు చంద్రబాబు తెచ్చాడని. ప్రపంచ ప్రఖ్యాత కియా కార్ల కంపెనీని అనంతపురం జిల్లాలో స్థాపించడంలో కర్త, కర్మ, క్రియ అన్నీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుదే. టిడిపి కియా తెచ్చినప్పుడు వైసీపీ నేత విజయసాయిరెడ్డి అమ్ముడుబోని కార్ల కంపెనీ కియా అని, కమీషన్ల కోసం చంద్రబాబు ఆంధ్రకు తెచ్చాడని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డి కూడా చంద్రబాబు కియాని తెచ్చి రైతుల పొట్ట కొడతన్నాడని, దీనిని అడ్డుకుని తీరతామని ప్రకటించారు. ఏపీలో కియా తెచ్చిన టిడిపి సర్కారు ఓడిపోయింది. వైసీపీ సర్కారు వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కియా వాళ్లను కమీషన్ల కోసం వైసీపీ నేతలు బెదిరించారు. దీంతో అనుబంధ పరిశ్రమలు కర్ణాటకకి తరలించుకుపోయేందుకు కియా సిద్ధమైంది. కియా చంద్రబాబు తేలేదని, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి బతికి వున్నప్పుడు లేఖ రాయడం వల్లే వచ్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీ చెప్పిన బుర్రకథ ఇప్పటికీ నెట్టింట నవ్వులు పంచే ట్రోల్. తాజాగా కియా ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి నాలుక మడతేసి ట్వీట్ తిరగేయడం చర్చనీయాంశం అవుతోంది. నేడు కియా కార్ల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం గర్వకారణమన్న ట్వీటుతోనే నాడు అమ్ముడుబోని కార్ల కంపెనీ కమీషన్లు ఇచ్చి ఏపీకి వస్తోందని ట్వీటారు. విజయసాయిరెడ్డి ఇంతలా నాలుక మడతేయడం ప్రతీసారీ అలవాటే అయినా కియా విషయంలో ట్వీటు మార్చి మరింత అభాసుపాలయ్యారు.
ఒక్క దెబ్బతో ఫూల్ అయిన విజయసాయి రెడ్డి.. ఆట ఆడుకున్నసోషల్ మీడియా..
Advertisements