వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, 2019 ముందు వరకు జగన్ నెంబర్ వన్ అయితే, విజయసాయి రెడ్డి నెంబర్ టు గా ఉండే వారు. పార్టీలోనే కాదు, కేసుల్లో కూడా జగన్ ఏ1 అయితే, విజయసాయి రెడ్డి ఏ2. ఇప్పటికే విజయసాయి రెడ్డికి రెండు సార్లు రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వం త్వరలోనే ముగుస్తుంది కూడా. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత, విజయసాయి రెడ్డికి తిరుగు ఉండదని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే, విజయసాయి రెడికి ఢిల్లీలో కీలక పదవి కూడా ఇచ్చారు. ఒక పక్క రాజ్యసభ సభ్యడుగా ఉంటూ, లాభదాయక పదవులు పై అభ్యంతరం రావటంతో, రూల్స్ మార్చి మరీ విజయసాయి రెడ్డికి పదవి ఇచ్చారు. ఇంత రిస్క్ తీసుకుని మరీ విజయసాయి రెడ్డి పదవి ఇచ్చారు. సరే, ఇది ఇక్కడితో అయిపొయింది. ఏమైందో ఏమో కానీ విజయసాయి రెడ్డి అధికారాలకు నెమ్మదిగా కత్తెర పడుతూ వచ్చింది. సజ్జల రామకృష్ణా రెడ్డి రాకతో, విజయసాయి రెడ్డి నామమాత్రం అయిపోయారు. విజయసాయి రెడ్డిని కేలవం మూడు జిల్లాలకు పరిమితం చేసారు. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి హవా కొనసాగే విధంగా, విజయసాయి రెడ్డి వ్యవహరించారు. అయితే ఎందుకో కానీ, గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డిని, జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా దూరం పెడుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది.
అందుకే గత నెల రోజులుగా విజయసాయి రెడ్డి, ప్రతిపక్షాల పై కూడా ఎలాంటి ట్వీట్లు పెట్టటం లేదు. ప్రతి రోజు ప్రతిపక్షాలను కవ్విస్తూ ట్వీట్లు పెట్టే విజయసాయి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డిని మరో బాధ్యత నుంచి తప్పించారు. ఢిల్లీలో వైసిపి అంటే విజయసాయి రెడ్డి అనే పేరు ఉండేది. ఇప్పుడు ఢిల్లీలో విజయసాయి రెడ్డి బాధ్యతలు అన్నీ, మాజీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్ కు ఇచ్చారు. ఆయన రిటైర్డ్ అయిన మరుసటి రోజే, ఆయనను సలహాదారుగా నియమిస్తూ, కేంద్రంతో అనేక అంశాల పై పనులు చక్కబట్టే బాధ్యతులు అప్పగించారు. ఇందుకోసం ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ హోదాతో పాటుగా, రూ.2.50 లక్షల జీతం కూడా ఇచ్చారు. అయితే విజయసాయి రెడ్డి బాధ్యతలు ఆయనకు ఇవ్వటం, అలాగే త్వరలో విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం కూడా మళ్ళీ పొడిగించరు అనే వార్తలు రావటంతో, విజయసాయి రెడ్డి బాధ్యతులు ఒక్కోటిగా కత్తిరించి, ఆయన పదవిని నామమాత్రం చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది.