విజయసాయి రెడ్డి అనే పేరు ఒకప్పుడు వైసీపీ పార్టీల మారుమొగి పోయేది. జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా, విజయసాయి రెడ్డి పేరు వినిపించేది. విజయసాయి రెడ్డి దగ్గరకు వెళ్తే చాలు పని అయిపోతుంది అనే భావన వైసీపీ ఉండేది. విజయసాయి రెడ్డి అపాయింట్మెంట్ ల కోసం, పెద్ద పెద్ద నేతలు ఎదురు చూస్తూ ఉండే వారు. అప్పట్లో పేరుకు జగన్ నంబెర్ వన్ అయినా, మొత్తం నడిపించేది విజయసాయి రెడ్డి. అయితే రోజులు మారే కొద్దీ సీన్ కూడా మారిపోతూ వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, విజయసాయి రెడ్డి హోదా పోయింది. ఆయన ప్లేస్ లో సజ్జల వచ్చారు. విజయసాయి రెడ్డిని మూడు జిల్లాలకు పరిమితం చేసారు. ఇప్పుడు ఆ మూడు జిల్లాల నుంచి కూడా పీకే పనిలో ఉన్నారు. ఇక విజయసాయి రెడ్డి రాజ్యసభ సీటు కూడా త్వరలో ముగిసిపోతుంది. విజయసాయి రెడ్డికి, మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి చాన్స్ ఇవ్వరు అనే ప్రచారం జరుగుతుంది. చివరకు విజయసాయి రెడ్డిని పార్టీలోని అన్ని విభాగాలకు ఇంచార్జ్ గా పరిమితం చేసారు. మొత్తంగా విజయసాయి రెడ్డి తోక కట్ చేసి, జగన్ వదిలేసారు. దీంతో విజయసాయి రెడ్డి తన ఇమేజ్ కాపాడుకోవటానికి చిత్ర విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని జగన్ ని తిడుతుంటే, విజయసాయి రెడ్డి జాబ్ మేళా అంటూ బయలుదేరారు.
అది కూడా కేవలం వైసీపీ కార్యకర్తలకే. కార్యకర్తలకు తానూ ఏదో చేసేస్తున్నా అనే ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ పేరు తక్కువగా, విజయసాయి రెడ్డి పేరు ఎక్కువగా వచ్చేలా హడావిడి చేస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియా టీంని ఉపయోగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా విజయసాయి తిరుపతిలో హడావిడి చేసారు. అయితే తిరుపతిలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు విజయసాయి వైపు కూడా వెళ్ళలేదు. భూమన, చెవిరెడ్డి వెళ్లి కలిసారు తప్పితే, ఇక ఏ నేత అటు వైపు కూడా చూడలేదు. డిప్యూటీ సియం నారాయణ స్వామి అక్కడే ఉన్నా, విజయసాయి రెడ్డి దగ్గరకు వెళ్ళలేదు. కొంత మంది మీడియా లేకుండా కలిసి వెళ్ళారు, మీడియా ఉంటే ఎందుకు అనుకున్నారో ఏమో మరి. విజయసాయి రెడ్డి వెంట, సోషల్ మీడియాలో హడావిడి చేసే గుర్రం లాంటి వాళ్ళు తప్ప, చెప్పుకోతగ్గ నేతలు ఎవరూ లేదు. మరి తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలు ప్రకారమే నేతలు ఎవరూ కలవలేదా, లేదా మరేదైనా కారణమా అనేది తెలియాలి.