వైఎస్సార్ రైతుభరోసా అని భారీ ప్రకటనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా తాను బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాను అంటూ ప్రకటించేశారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సీఎం జగన్ రెడ్డి గాలి తీసేశారు. తెలిసి చేశారో, తెలియక చేశారో...కావాలనే ఇరికిద్దామనే ఆలోచనతో చేశారో కానీ విజయసాయిరెడ్డి ట్వీటు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ జగన్ బటన్ నొక్కడానికి ప్రకటనలు ఇచ్చిన సమయానికే ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద రైతుల ఖాతాలత్లో రూ.2000 జమ అయిపోయింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ ఆలోచనల ప్రతిరూపమే ఈ పథకం అంటూ కితాబు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 16800 కోట్లు విడుదల చేసినందుకు రైతుల తరఫున దన్యవాదాలు తెలిపారు సాయిరెడ్డి. ఇవేవో తన జేబులోంచి ఇస్తున్నట్టు జగన్ రెడ్డి భారీ ప్రకటనలు కూడా ఇచ్చేశారు. దీనికి పేరు కూడా ఇచ్చిన ప్రధాన మంత్రి పేరు చివరన కనపడకుండా పీఎం కిసాన్ అని వేసి తాటికాయంత అక్షరాల్లో వైఎస్సార్ రైతు భరోసా అని వేయించారు. అయితే విజయసాయిరెడ్డిని సీఎం జగన్ రెడ్డి దూరం పెట్టారని, పదవులన్నీ పీకేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీని పొగుడుతూ వేసిన విజయసాయిరెడ్డి ట్వీటు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలో చేరతారనే ఊహాగానాలకు ఊతమిస్తోంది.
వైసీపీని అడ్డంగా బుక్ చేసిన విజయసాయిరెడ్డి...
Advertisements