జగన్ పార్టీలో నెంబర్ 2, వైసీపీ కీలక నేత, అలాగే పార్లమెంటరీ నేతగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అనూహ్యంగా, విజయసాయి రెడ్డి నియామకం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విజయసాయి రెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకు సంబంధించి గత నెల 22న జారీ చేసిన జీవో నెంబర్ 68ని రద్దు చేస్తూ తాజాగా మరో ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఆయన పదవి ఎందుకు రద్దు చేసింది అధికారికంగా మాత్రం చెప్పలేదు. మీడియాకు ఇచ్చిన లీక్లు ప్రకారం, ఆయన ఇపటికే రాజ్యసభ ఎంపీగా లాభదాయక పదవిలో ఉన్నందున ఆయన నియామకం చెల్లదని, అందుకే రద్దు చేసామని చెప్తున్నారు. ఒక వేళ రెండు పదవుల్లో కొనసాగితే, రాజ్యసభ సభ్యతిత్వానికి అనర్హుడిగా ప్రకటించే అవకాసం ఉందని, అందుకే ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా చేసిన నియామకం వెనక్కు తీసుకున్తున్నట్టు చెప్తున్నారు.

విజయసాయిరెడ్డి స్థానంలో మరొకరిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే విజయసాయి ప్లేస్ లో వచ్చే ఆ ఇంకో వ్యక్తి ఎవరూ అనేదాని పై ఇప్పటి వరకు సమాచారం లేదు. అయితే విజయసాయి రెడ్డిని నియమించ కూడదు అని తెలిసినా, ఎందుకు నియమించారు ? ఇప్పుడు ఆయన్ను ఎందుకు తీసేశారు అనే విషయం పై మాత్రం క్లారిటీ లేదు. అంటే ప్రభుత్వంలో ఉండే అధికారులకు అంత మాత్రం తెలియదా ? లేక తెలిసే ఇలా చేసారా ? అధికారులకు తెలియకపోతే, జగన్ మోహన్ రెడ్డికి తెలియదా ? క్యాబినెట్ ర్యాంక్ పదవి విజయసాయి రెడ్డికి ఇస్తున్నాం అని ప్రచారం చేసి, ఇప్పుడు ఎందుకు ఇలా చేసారు అనే విషయం తెలియాలి. ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వం ప్రతినిధిగా, ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ నేతను అక్కడ పెట్టటం ఆనవాయితీగా వస్తోంది. తెలుగుదేశం పార్టీ హయాంలో కంభంపాటి రామ్మోహన్‌రావు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు. ఇది క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ కావటంతో, అందరూ దీని కోసం పట్టుబడతారు. అయితే జగన్ , విజయసాయి రెడ్డికి ఇవ్వటంతో, వైసీపీ నుంచి ఎవరూ దాన్ని ప్రశ్నించలేక పోయారు. మరి ఇప్పుడు కొత్తగా ఎవరికి ఇస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read