గత కొంత కాలంగా, వైసీపీ పార్టీలో, వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేకత విధానాల పై, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు, వైసీపీ చేస్తున్న ప్రతి తప్పుని ఎత్తి చూపిస్తున్నారు. ముందుగా తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేసి ఇంగ్లీష్ మీడియం పెట్టటం పై, ఏకంగా పార్లమెంట్ లోనే, సొంత పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇక ఇసుక మాఫియా ఆగడాలు గురించి రాష్ట్రం అంతా ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా రఘురామ కృష్ణం రాజు, బహిరంగంగానే చెప్పారు. అలాగే తిరుమల భూములు అమ్మకం విషయం పై మొదట స్పందించింది రఘురామకృష్ణం రాజే. ఇక ప్రభుత్వ భవనాలకు రంగులు విషయం, ఎలక్షన్ కమీషనర్ విషయం, ఇలా ప్రతి విషయం పైనా, ఆయన తన అభిప్రాయం తెలిపారు. నిజానికి ఇవన్నీ తప్పుడు విధానాలే అయినా, సొంత పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు చెయ్యటంతో అందరూ అవాక్కయ్యారు. అయితే, ఇదే విషయం పై రఘురామ కృష్ణం రాజుని అడగగా, తాను అనేక సార్లు జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఈ విషయాలు అన్నీ చెప్దాం అనుకున్నాం అని, కానీ ఆయన తనకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేడని, అందుకే మీడియా ద్వారా ఆయనకు ఈ విషయాలు తెలుపుతున్నాని చెప్పారు.

అయితే ఈ విషయం పై ఎట్టకేలకు వైసిపీ స్పందించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో, విజయసాయి రెడ్డి, రఘురామకృష్ణం రాజుకు షోకాజ్ నోటీస్ పంపించారు. వారం రోజుల్లోగా తమకు సమాధానం చెప్పాలి అంటూ, రఘురామకృష్ణం రాజుకి విజయసాయి రెడ్డి నోటీస్ పంపించారు. ఆ షోకాజ్ నోటీసులో అంశాలు గమనిస్తే, మీరు ఎంపీగా, వైసిపీ సింబల్ పైన గెలిచారు, పార్లమెంట్ లో ఒక కమిటీకి మెంబెర్ గా ఉన్నారు, అయితే మీరు గత కొన్ని రోజులుగా పార్టీని కించపరుస్తూ మాట్లాడుతున్నారు అని ఆ నోటీస్ లో ఉంది. షోకాజ్ నోటీస్ ఇవ్వటానికి గల కారాణాలు కూడా వివరించారు. ఇంగ్లీష్ మీడియం మేము మ్యానిఫెస్టోలో పెడితే మీరు వ్యతిరేకించారు. అలాగే వైసిపీ ఎమ్మెల్యేలు, ఇసుక దోపిడీ చేస్తున్నారు అన్నారు. ఒక సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ, ఎవరి నాయకత్వం నాకు కావలి ? బొచ్చులో నాయకత్వం అని, పార్టీ అధినేతను కించపరిచారు. అలాగే వివిధ టీవీ చర్చల్లో, పార్టీని చులకన చేసి మాట్లాడారు. అలాగే మీరు సింహం అని, మిగతా వాళ్ళు పందులు అని అన్నారు. ఇవన్నీ మీరు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారు అని తెలియచేస్తున్నాయి, అంటూ విజయసాయి రెడ్డి, రఘురామ కృష్ణం రాజుకి, నోటీస్ పంపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read