ఈ రోజు రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి, చుక్కెదురైంది. రాజ్యసభలో కరోనా వైరస్ పై చర్చ సందర్భంగా, విజయసాయి రెడ్డికి అవకాసం రావటంతో, ఆయన కరోనా సబ్జెక్ట్ పైన కాకుండా, కోర్టులను, జడ్జీలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తమ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పై అడ్డు చెప్తూ, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటూ, కోర్టులు తమ ప్రభుత్వ నిర్ణయాల పై స్టే ఇస్తున్నాయని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తమ రాష్ట్రంలో శాసన వ్యవహారాలు, కార్యనిర్వాహిక వ్యవహారాలు కోర్టులు నడిపిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేయటం దుమారం రేగింది. అయితే విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ప్రసాద్, అభ్యంతరం చెప్పారు. కోర్టుల విషయం ఇక్కడ కాదని, సబ్జెక్టు పై మాట్లాడాలని కోరారు. అయినా విజయసాయి రెడ్డి కోర్టుల పై విమర్శలు చేస్తూనే ఉన్న సమయంలో, తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అభ్యంతరం చెప్పారు.

కోర్టు పరిధిలో ఉన్న అంశాలు ఇక్కడ మాట్లాడ కూడదు అని, అయినా కోర్టులను బెదిరించే ధోరణిలో మాట్లాడటం సరికాదని, చైర్మెన్ ఇచ్చిన సబ్జెక్ట్ పై మాట్లాడాలని, ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇదే అంశం పై తెలుగుదేశం ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. కోర్టులు ఎప్పుడైనా చట్టాల ప్రకరామే నడుచుకుంటాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాలను దాటి ప్రవర్తిస్తుంది కాబట్టే, అన్ని కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అన్నారు. విజయసాయి రెడ్డి మాటలు, న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే విధంగానే ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలు పై కోర్టుకు వెళ్తామని అన్నారు. నిన్న పార్లమెంట్ లో, ఈ రోజు రాజ్యసభలో, ఓక ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తున్నారని, అలాగే సోషల్ మీడియాలో కూడా జడ్జిల పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, ఇవన్నీ కోర్టు దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. ఒక పాక చర్చ కరోనా పైన అయితే, విజయసాయి రెడ్డి మాత్రం, చంద్రబాబు జపం, న్యాయస్థానాల జపం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read