పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లాకు, అలాగే సభా హక్కుల కమిటీ చైర్మెన్ కు, నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు ఈ రోజు లేఖ రాసారు. తన పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కలిసిన అనంతరం, మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేయటం పైన, సభా హక్కుల చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో కోరారు. అంతే కాకుండా, స్పీకర్ పక్షపతంగా వ్యవహరిస్తున్నారు అంటూ, లోక్సభ స్పీకర్ పై, విజయసాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ, రఘురామరాజు ఫిర్యాదు చేసారు. అలాగే తన పై అనర్హత వేటు వేయకపోతే, వచ్చే పార్లమెంట్ సభని అడ్డుకుంటాం అంటూ కూడా విజయసాయి రెడ్డి బెదిరింపులకు దిగారని కూడా ఆ ఫిర్యాదులో తెలిపారు. గతంలో కూడా ఇదే విధంగా, రాజ్యసభలో, రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు పై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారని, అప్పట్లో ఆయన చర్యల పై అందరూ అభ్యంతరం చెప్పటంతో, ఆయన రాజ్యసభకు, చైర్మెన్ కు సారీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పుడు మళ్ళీ స్పీకర్ పై, ఇలా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయటం మంచది కాదని, ఒక పరిణితి చెందిన వ్యక్తి ఇలా స్పీకర్ పై కామెంట్ చేయటం కరెక్ట్ కాదని, ఈ వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని, సభా హక్కల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని లేఖలో రాసారు.
అయితే ఆయన రాజ్యసభకు చెందిన వ్యక్తి కావటం, ఇప్పుడు రఘురామరాజు లోక్సభ స్పీకర్ కు విజయసాయి రెడ్డి పై ఫిర్యాదు చేయటంతో, దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. మాములుగా సభా హక్కుల ఉల్లంఘన అనేది, తమ సభ సభ్యలు అయితేనే ఇస్తారు, ఇక్కడ మాత్రం వేరే సభలో ఉన్న వ్యక్తీ, ఇక్కడ సభలో ఉన్న స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు కాబట్టి, సభ హక్కుల ఉల్లంఘన కింద రఘురామకృష్ణం రాజు ఇచ్చిన నోటీసుని స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు ఢిల్లీలో ఉన్న విజయసాయి రెడ్డి, పార్లమెంట్ స్పీకర్ ని కలిసారు. ముఖ్యంగా రఘరామకృష్ణం రాజు పై అనర్హత వేటు విషయంలో స్పీకర్ ని కలిసారు. ఆయన పై ఫిర్యాదు చేసి చాలా రోజులు అయ్యిందని, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. అయితే బయటకు వచ్చి, స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, సభను ఈ విషయంలో అడ్డుకుంటాం అంటూ బెదిరించటం పై రఘురామరాజు ఫిర్యాదు చేసారు.