2017లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డితో పాటుగా, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి, అంబటి రాంబాబు సహా, కొంత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విశాఖపట్నంలో ప్రత్యెక హోదా పై నిరసన కార్యక్రమం అంటూ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో విశాఖలో పెట్టుబడులు సదస్సులు జరుగుతూ ఉండేవి. వీళ్ళు కార్యక్రమం పెట్టుకున్న సమయంలో, పెట్టుబడులు సదస్సు జరుగుతుంది. 40 దేశాల నుంచి ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక వేత్తలు ఇక్కడ వచ్చారు. దీంతో ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమం తరువాత రోజు పెట్టుకోవాలని, వాళ్ళు ఉండగా నిరసన కార్యక్రమాలు చేస్తే, తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కోరింది. అయినా వినలేదు. వేరే ప్రదేశంలో పెట్టుకోవాలని చెప్పినా వినకుండా, కేవలం పెట్టుబడులు సదస్సు జరుగుతున్న విశాఖకు వస్తాం అంటూ, జగన్ మోహన్ రెడ్డి అండ్ కో అక్కడకు బయలుదేరి వెళ్లారు. అయితే పెట్టుబడులు సదస్సు ఎక్కడా వీళ్ళ అలజడితో, డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో, అప్పటి పోలీస్ అధికారులు, అనేక నిబంధనలు విధిస్తూ, వీరి నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. జగన మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిని ఎయిర్ పోర్ట్ లోనే ఆపేశారు. అయితే ఆ సందర్భంగా, జగన్, విజయసాయి రెడ్డి , పోలీసులు పై ఎదురు తిరిగారు.
ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ నువ్వు , రెండే రెండేళ్ళు ఎవరినీ వదలను అంటూ, పోలీసులను బెదిరించారు. అయితే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు కావటంతో, పోలీసులు పై ఫిర్యాదు చేసారు. పోలీసులు తమ హక్కులకు భంగం కలిగించారని, అమర్యాదగా వ్యవహరిస్తూ, దుర్భాషలాడారని, అనేక ఆరోపణలు చేస్తూ, 2017లోనే రాజ్యసభ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగింది అంటూ, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదు పైన భేటీ ఆయన కమిటీ, అప్పటి విశాఖ కమీషనర్ మీనా, అసిస్టెంట్ కమీషనర్ చిట్టి బాబును పిలిపించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్ళను ఎందుకు అడ్డుకుంది చెప్తూ, తాము వారి పై ఎలాంటి అగౌరవంగా ఏమి ప్రవర్తించలేదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని, సభా హక్కుల కమిటీకి వివరణ ఇచ్చారు. దీంతో వారి వివరణతో సంతృప్తి చెందిన ప్రివిలేజ్ కమిటీ, విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై, ఎక్కడా సభా హక్కుల నిబంధనలు జరగలేదని తేల్చారు. ఒక రాజ్యసభ సభ్యుడిగా తన విధులకు ఆటంకం కలిగిస్తేనే సభా హక్కుల ఉల్లంఘన అవుతుందని, పార్టీ కార్యక్రమాలకు వెళ్ళటం రాదని స్పష్టం చేస్తూ, పార్లమెంట్ కు తమ నివేదికను ఇచ్చింది.