ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా మహిళా ఎమ్మెల్యేను నియమించాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన వైఎస్ జగన్.. తాజాగా హోం మంత్రిగా మహిళను నియమించారని తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు..? హోం శాఖ బాధ్యతలు స్వీకరించే అదృష్టవంతురాలు ఎవరు..? అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మొత్తం 09 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో చాలా వరకు సీనియర్లు ఉండగా.. జూనియర్లు మాత్రం తక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే రోజా పేరు దాదాపు ఖరారు అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడనుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడిన రోజా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేయడంతో కచ్చితంగా హోంశాఖ ఆమెనే వరించిందని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటున్నారు. మరో పక్క, జగన్ ఆదేశాల మేరకు మంత్రులుగా ఖరారైన వారికి వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినట్లు తెలిసింది. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, మేకతోటి సుచరితలకు ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ నలుగురికీ శనివారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావాలని విజయసాయి చెప్పినట్లు తెలిసింది. వీరితో పాటు ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బుగ్గన, కొడాలి నాని, పార్థసారధికి ఫోన్లు చేసి రేపు (శనివారం) మంత్రులుగా ప్రమాణం చేయడానికి రవాల్సిందిగా చెప్పారు.
ఇంకా 17 మందికి విజయసాయిరెడ్డి ఫోన్ చేయనున్నారు. మొత్తం 25 మందితో జగన్ కేబినెట్ ఏర్పాటు కానుంది. వీరిలో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. అయితే. వారు ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మంత్రుల శాఖలపై కూడా శుక్రవారం రాత్రికి గానీ, శనివారం ఉదయానికి గానీ స్పష్టత వచ్చే అవకాశముంది. మొత్తం 25 మందితో జగన్ కేబినెట్ ఏర్పాటు కానుంది. వీరిలో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. అయితే.. వీరు ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మంత్రుల శాఖలపై కూడా శుక్రవారం రాత్రికి గానీ, శనివారం ఉదయానికి గానీ స్పష్టత వచ్చే అవకాశముంది. జగన్ ఎవరెవరికి ఏ శాఖ అప్పగించాలనే అంశంపై కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.