బయట తక్కువగా, ట్విట్టర్ లో ఎక్కువగా కనిపించే వైసిపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి జలఖ్ ఇచ్చారు, ఒక విలేకరి. విజయసాయి రెడ్డి, విశాఖపట్నంలో నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అటు చంద్రబాబు పై, ఇటు పవన్ కళ్యాణ్ పై టార్గెట్ పెట్టుకుని, విమర్శలు గుప్పించారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, రూల్స్ తమకు వర్తించవు అన్నట్టు మాట్లాడారు. చిన్న విమర్శ చేస్తేనే, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టే వారి పై కేసులు పెట్టి, అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, ఇప్పుడు కొత్తగా మీడియాను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకోవటానికి, కొత్త జీవో విడుదల చేసారు. అందులో, మీడియాలో తమకు వ్యతిరేక వార్తలు, వస్తే, కేసు పెడతాం అని చెప్తున్నారు. అయితే, ఈ రూల్స్ అన్నీ ప్రతిపక్షం వారికే అనట్టు, విజయసాయి రెడ్డి మీడియా సమావేశంలో వ్యవహరించారు. చంద్రబాబుని పెద్ద నిక్క, లోకేష్ ని చిన్న నక్క అంటూ, జుబుక్సాకర రీతిలో స్పందించారు.
ఇసుక మీద చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు అంటూ, వ్యాఖ్యలు చేసారు. అంతా సవ్యంగా సాగుతుందని, జగన పాలనను దేశం అంతా మేచ్చుకుంటుందని, దేశానికి ఆదర్శంగా జగన్ పాలిస్తున్నారని, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేసారు. అయితే చంద్రబాబు, అతని పార్టనర్ మాత్రం, జగన్ పై విరుచుకు పడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన కాల్ షీట్లు, పవన్ కళ్యాణ్ కు ఇంకా అయిపోలేదని, చంద్రబాబుకు కావాల్సిన సమయంలో, పవన్ కళ్యాణ్ వచ్చి ఆక్షన్ చేస్తున్నారని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి దత్త పుత్రుడని, లోకేష్ సొంత పుత్రుడు అని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి తీసుకుని, చంద్రబాబుకి ఇష్టం వచ్చినట్టు, ఇక్కడ ఆక్షన్ చేస్తున్నారని అన్నారు.
అయితే ప్రెస్ మీట్ లో, ఒక విలేఖరి ధైర్యం చేసుకుని అడిగిన ప్రశ్నకు, విజయసాయి రెడ్డి అవాక్కయ్యారు. తడబడుతూ సమాధానం చెప్పి, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని, మీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటున్నారు కదా, దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ? అని అడిగారు. దీనికి విజయసాయి రెడ్డి, ముందుగా అవాక్కయ్యారు. ఏమి సమాధానం చెప్పాలో తెలియక, కొంచెం సేపు తడబడ్డారు. తరువాత తేరుకుని, అన్నిటికీ ఆధారాలు ఉండవు, కొన్ని మనసుకే తెలుస్తాయి అని చెప్పి వెళ్ళిపోయారు. మరి మనసుకి తెలిసే కధనాలు, పత్రికలు రాస్తే, మేము అరెస్ట్ చేస్తాం అంటూ జీవో ఇచ్చిన విజయసాయి రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం, ఇలాంటి ఆరోపణలు చేసే వారి పై ఏమి స్పందించదా ? అని విలేఖరులు అడుగుతున్నారు.