వైసీపీ రాజ్యసభ సభ్యుడు, విజయసాయి రెడ్డి, రాజ్యసభ చైర్మెన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి, రాజ్యసభలోనే క్షమాపణ చెప్పారు. నిన్న రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు పట్ల, అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి పై, కేంద్రమంత్రి, పార్లమెంటరీ శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి మందలించారు. రాజ్యసభ చైర్మెన్ పట్ల అందరికీ గౌరవం ఉండాలని, నిన్న జరిగిన సంఘటన పై, చేసిన వ్యాఖ్యల పై, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణ కోరాలని, ప్రహ్లాద్ జోషి సభలోనే హెచ్చరించారు. ఈ విధంగా సభా గౌరవాన్ని మంటగలపకూడదు, రాజ్యసభ చైర్మెన్ స్థానాన్ని అందరూ కూడా గౌరవించాలి, క్షమాపణ చెప్పకపోతే కనుక ఏదైనా చర్యలు తీసుకోవాలి అంటూ ప్రహ్లాద్ జోషి రాజ్యసభాలోనే డిమాండ్ చేసారు. దీని పై స్పందించిన వెంకయ్య, ఇలా బలవంతంగా చెప్పించిన అవసరం లేదని వ్యాఖ్యలు చేస్తూ ఉండగానే, వెంటనే విజయసాయి రెడ్డి లెగిసి, వెంకయ్యకు క్షమాపణ చెప్పారు. నిన్న చేసిన వ్యాఖ్యలు ఉపసమహరించుకుంటున్నా అని, రాజ్యసభ చైర్మెన్ ను అగౌరవ పరచాలని అనుకోలేదు. నిన్న ఆవేశంలో మాట్లాడాను. చైర్ ను అనేంతటి వాడిని కాదు, నా వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించండి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా, ఇలా మాట్లాడకుండా చూసుకుంటాను, అంటూ హామీ ఇచ్చారు. తొందరపాటులో, నిన్న అలా మాట్లాడానని, క్షమించమని కోరారు.
ఇక విషయానికి వస్తే, నిన్న రాజ్యసభలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో, సభలో పెద్ద గందరగోళం జరిగింది. నిన్న సభ ప్రారంభం కాగానే, విజయసాయి రెడ్డి లెగిసి పాయింట్ అఫ్ ఆర్డర్ అంటూ, 4 వ తారిఖు కనకమేడల, జగన్ పై చేసిన వ్యాఖ్యలు రికార్డ్స్ నుంచి తొలగించి, చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఏ రోజుకి ఆ రోజు అయితేనే పాయింట్ అఫ్ ఆర్డర్ ఇవ్వాలని, నాలుగు రోజులు క్రితం జరిగిన దానికి, ఇప్పుడు పాయింట్ అఫ్ ఆర్డర్ కుదరదు అని, అయితే మీరు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదు చేయాలని వెంకయ్య కోరారు. అయితే విజయసాయి రెడ్డి మాత్రం, ఊగిపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చైర్మెన్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేసారు. వెంకయ్య మనసు టిడిపితో, తనువు బీజేపీతో ఉందని, పక్షపాతంతో వ్యవహరిస్తారని, టిడిపికి ఎక్కువ సమయం కేటాయిస్తారు అంటూ, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కుదిరినట్టు అక్కడ కుదరదు కదా, నిన్నే కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు, బీజేపీ ఎంపీలు విజయసాయి రెడ్డిని తిట్టారు. ఈ రోజు దెబ్బకు దిగి వచ్చి, ఉపరాష్ట్రపతికి క్షమాపణ చెప్పారు.