ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలు అడ్డాల వెంకటరత్నం, రాహుల్‌దేవ్‌శర్మలను ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి ఆకస్మికంగా బదిలీ చేసింది. వారిని పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.నిఘా విభాగంలో ప్రస్తుతం తన తర్వాత అధికారికి బాధ్యతలు అప్పగించి వెంకటేశ్వరరావు రిలీవ్ కావాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రస్తుత ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు, బాధ్యతలు అప్పగించరాదని స్పష్టం చేసింది. శ్రీకాకుళం, కడప ఎస్పీలు వారి తర్వాతి ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణమే రిలీవ్ కావాలని ఆదేశించింది. వీరిని ఎన్నికల విధులు, బాధ్యతలకు దూరంగా ఉంచాలని పేర్కొంది.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈసీ నిబంధనల పరిధిలోకి రాదని నిబంధనలు స్పష్టంచేస్తున్నందున రాష్ట్రంలోని కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల్లో ఉన్న పోలీసు సిబ్బందిని ఈసీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ఇంటెలిజెన్స్ వ్యవస్థకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఈ జీవో వెలువరించిన కాసేపటికే ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఎన్నికల ముందు ఇంటిలిజెన్స్ చీఫ్ సహా, ఇద్దరు ఎస్పీల బదిలీకి కారణమేంటని ఎన్నికల సంఘాన్ని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఆర్థిక నేరస్థుడు విజయసాయిరెడ్డి పిటిషన్ ఆధారంగా బదిలీ చేస్తారా? అని నిలదీశారు. ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బంది పెట్టాలని చూడడం సబబు కాదన్నారు. ఏ కారణంతో బదిలీ చేశారో సమాధానం చెప్పలేకపోతున్నారని చంద్రబాబు ఈసీకి లేఖ రాసారు..
అయితే, ఈ పరిణామాల నేపధ్యంలో, విజయసాయి రెడ్డి మాట్లాడిన వీడియో ఇప్పుడు బయట పడి, వీళ్ళ ప్లాన్ మొత్తాన్ని బయట పెట్టింది. శుక్రవారం విజయసాయి రెడ్డి మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. అందులో విజయసాయి మాట్లాడుతూ, సోమవారం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నాం, మంగళవారం ఈ ఆఫీసర్ల పై చర్యలు తీసుకుంటారు అంటూ నొక్కి మరీ చెప్పారు. అయితే, ఆశ్చర్యంగా, విజయసాయి రెడ్డి చెప్పినట్టే, జరిగింది. మంగళవారం రాత్రి, ముగ్గురు ఆఫీసర్లని బదిలీ చేసారు. ఇప్పుడు తెలుగుదేశం వాదనకి బలం చేకూరినట్టు అయ్యింది. మోడీ, జగన్, ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణల నేపధ్యంలో, విజయసాయి రెడ్డి వీడియో, బయట పడటంతో, వైసీపీ, బీజేపీ ఆత్మరక్షణలో పడ్డాయి... Video:https://www.facebook.com/VoteforTDP/videos/1204327776391244/