యాభై శాతం వీవీ ప్యాట్లలోని స్లిప్పులు లెక్కించాలంటూ… టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. గతంలో.. ఈ అంశంపై.. ఐదు వీవీ ప్యాట్లు లెక్కించాలంటూ.. ఇచ్చిన తీర్పును రివ్యూ చేయడానికి… సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు.. చంద్రబాబు నేతృత్వంలో ఇరవై ఒక్క పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఎన్నికల ప్రక్రియ చివరి దశకు వస్తున్నందున.. ఈ పిటిషన్‌ను త్వరితంగా విచారించాలని.. ఆయా పార్టీలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమస్థానం రేపు విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి హస్తినకు వెళ్లనున్నారు.

cbn 06052019

వీవీ ప్యాట్ల లెక్కింపు సంఖ్యను పెంచాలన్న పిటిషన్‌పై మంగళవారం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో బాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబుతో సమా బీజేపీయేతర పక్షాల నేతలు ఈ విషయంపై కోర్టులో హాజరుకానున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ల లెక్కింపును పునః పరిశీలించాలని సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రివ్యూ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులోనే వినాలని పిటిషనర్ల తరపున లాయర్ అభిషేక్ మనుసింఘ్వి చీఫ్ జస్టిస్‌ను కోరారు. ఈ అభ్యర్థనను సీజే అంగీకరించడంతో ఈ వ్యవహారంపై బాబు సోమవారం రాత్రి హస్తినకు వెళ్లనున్నారు. గతంలోనే, విపక్ష పార్టీలన్నీ సుప్రీంకోర్టుకు వెళ్లాయి. అయితే పేపర్ బ్యాలెట్ వాడాలని.. లేకపోతే వీవీ ప్యాట్ స్లిప్పులను యాభై శాతం లెక్కించాలని పిటిషన్‌లో కోరాయి.

cbn 06052019

అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం యాభై శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలంటే కనీసం వారం రోజులు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో సుప్రీంకోర్టు .. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్లు లెక్కించాలని తీర్పునిస్తూ పిటిషన్‌పై విచారణ ముగించింది. ఈ తీర్పు మేరకే ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈవీఎంలలో తీవ్రమైన గందరగోళం తలెత్తుతూండటంతో.. మొత్తానికే మోసం జరుగుతోందన్న ఆందోళనలో విపక్ష పార్టీలు ఉన్నాయి. అందుకే నమ్మకం కుదరలాంటే కచ్చితంగా యాభై శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందేనని రివ్యూ పిటిషన్ వేశారు. బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడే.. లెక్కింపునకు.. ఒక్క రోజు కన్నా ఎక్కువ పట్టేది కాదని.. ఇప్పుడు వీవీ ప్యాట్లు లెక్కించడానికి ఎందుకు.. అంత సమయం పడుతుందని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read