యాభై శాతం వీవీప్యాట్ల లెక్కింపు చేపట్టాలని, చంద్రబాబు నాయకత్వంలో, 21 ప్రతిపక్షాల అభ్యర్థన పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 వీవీప్యాట్లలోని స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని పేర్కొంది. అలాగే లోక్‌ సభ నియోజకవర్గాల్లో అయితే 35 వీవీపాట్ల స్లిప్పులను లెక్కపెట్టాలని తెలిపింది. ఈ విషయంలో ఈసీ అభ్యర్థనను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నియోజకవర్గానికి కేవలం ఒక్క వీవీప్యాట్‌ స్లిప్‌లనే లెక్కపెడుతున్న విషయం తెలిసిందే. యాభై శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కపెట్టినట్లయితే ఆరు రోజుల ఆలస్యంగా ఫలితాలు వెల్లడవుతాయని ఎన్నికల సంఘం పేర్కొన్న విషయం తెలిసిందే.

cbn 08042019

దీనిపై 21 రాజకీయ పార్టీలు స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాలు ఆరు రోజులు ఆలస్యమైనా ఫరవాలేదని సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఈమేరకు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని విపక్షాలు ప్రమాణపత్రాన్ని సమర్పించాయి. ఎన్నికల ప్రక్రియ నిబద్ధతను కాపాడేటట్లయితే ఇదేమీ ఎక్కువ సమయం కాదని పేర్కొన్నాయి. సిబ్బంది సంఖ్యను పెంచితే ఆలస్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెప్పాయి. పారదర్శక ఎన్నికలు, ప్రజా ప్రయోజనం కోసమే పిటిషన్‌ వేశామని ప్రమాణపత్రంలో స్పష్టం చేశాయి. ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడం తమ ఉద్దేశం కాదని, ఎన్నికల ప్రక్రియ నిబద్ధతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకేనని పేర్కొన్నాయి.

cbn 08042019

ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా ఓట్లు బీజేపీకే పడుతున్నాయని ఆరోపిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని 21 పార్టీలకు చెందిన విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఉండే ఈవీఎంలలో 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడానికీ... ఫలితాలు వెల్లడించడానికీ దాదాపు ఆరు రోజులు పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ యేతర పార్టీల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆరు రోజులు పట్టినా పర్వాలేదనీ, వీవీప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలని ఆదేశించాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ సమగ్ర విచారణ చేపట్టి... ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read