ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కలిశారు. వెలగపూడి సచివాలయంలో, ముఖ్యమంత్రి ఛాంబర్లో చంద్రబాబు కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడాభివృద్ధి గురించి మాట్లాడారు... ఈ సందర్భంగా అమరావతిలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశం పై ఇరువురి మధ్య చర్చ జరిగింది.... రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ప్రణాలిక రూపొందించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు లక్ష్మణ్ నికోరారు... దీని కోసం లక్ష్మణ్ కూడా పోజిటివ్ గా స్పందించారు... త్వరలోనే పూర్తి ప్రణాళికతో వస్తాను అని చెప్పినట్టు సమాచారం...
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇదే విషయం తెలిపారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ది కోసం కార్యాచరణ రూపొందిస్తానని లక్ష్మణ్ చెప్పారు... అమరావతిలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశం పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు.... వరల్డ్ క్లాసు క్రికెట్ అకాడమీ ఇక్కడ ఏర్పాటు చెయ్యమని చంద్రబాబు కోరారని, మన రాష్ట్రం నుంచి, దేశానికి క్రికెట్ ఆడే వారిని తయారు చెయ్యాలని, అవసరమైన అన్ని రకాల సహాయాలు చేస్తామని, స్పోర్ట్స్ సిటీలో దీని కోసం స్థలం కేటాయిస్తామని, పూర్తి ప్రణాళికతో రమ్మని చంద్రబాబు కోరారు...
రెండు నెలల క్రితం అనిల్ కుంబ్లే కూడా విజయవాడ వచ్చినప్పుడు చంద్రబాబు స్పోర్ట్స్ పట్ల చూపిస్తున్న శ్రద్ధని కొనియాడారు... ఇప్పటికే ద్రావిడ్ తో కూడా, క్రికెట్ అకాడమీ కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు... మరో పక్క గోపిచంద్ గురించి చెప్పనవసరం లేదు.. హైదరాబాద్ లో ఆ రోజు గోపీచంద్ అకాడమీ పుణ్యమే, ఇప్పుడు సింధు, శ్రీకాంత్ లాంటి వారు తయారు కావటం, అని స్వయంగా వారే చెప్పిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే గోపీచంద్ కూడా అమరావతి స్పోర్ట్స్ సిటీలో అకాడమీ పెట్టనున్నారు...