తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంపై చేసిన ఆరోపణలు అన్నీ పచ్చి అబద్ధాలు అని వాద్వా కమిటీ రిపోర్ట్ చెప్తుంది... అంతే కాదు, ఈ వ్యవహారం మొత్తం రమణ దీక్షితులకు అన్ని విషయాలు తెలుసని, కూడా ఈ రిపోర్ట్ చుస్తే అర్ధమవుతుంది... అన్నీ తెలిసి కూడా, రమణ దీక్షితులు, స్వామి వారితో ఎందుకు రాజకీయం చెయ్యాలని అనుకున్నారు ? ఎవరి ఒత్తిడితో, ఎవరి ప్లాన్ తో ఇవన్నీ చేసారో తేలాల్సి ఉంది... ముఖ్యంగా రమణ దీక్షితులు ఒక భయంకర ఆరోపణ చేసారు... స్వామి వారికి ఒక పింక్ డైమెండ్ ఉండేది అని, 2001లో స్వామి వారికి గరుడ సేవ చేసే సమయంలో, అది పగిలి ముక్కలు అయ్యింది అని, అప్పుడు అది జాగ్రత్త చేసామని, కాని ఇప్పుడు అది కనిపించకుండా పోయింది అని, దాన్ని విదేశాల్లో కొన్ని వేల కోట్లుకి అమ్మేశారని ఆరోపణ చేసారు...
కాని అది తప్పు అని, ఈవో ఏకే సింగాల్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. జస్టిస్ జగన్నాథ రావు కమిటీ నివేదికలోనే 2001లో పగిలిపోయింది డైమాండ్ కాదని, రూబీ అని పేర్కొందని సింఘాల్ చెప్పారు. పగిలిపోయిన రూబీ ముక్కలు ఇప్పటికీ టీటీడీ ఆధీనంలోనే ఉన్నాయని తెలిపారు. ఆలయంలో రహస్యంగా ఏమీ జరగడం లేదన్నారు... ఆ పగిలన ముక్కలు మీడియా ముందు కూడా ప్రదర్శించారు... అయితే ఇదే విషయం వాద్వా కమిటీ రిపోర్ట్ చూస్తే కూడా స్పష్టంగా తెలుస్తుంది... వాద్వా కమిటీ అంటే, ఎదో ఆషామాషీ కమిటీ కాదు. "Justice Wadhwa Committee comprising of 2 Justices, 2 IAS Officers (Ex EOs too); 1 Ex DGP, 1 Ex AP Press Academy Chairman"
వాద్వా కమిటీ రిపోర్ట్ ప్రకారం.. "16-09-2009న పింక్ డైమెండ్ పోయింది అనే ఆరోపణల గురించి ఎంక్వయిరీ చేసాము. 2001లో అప్పుడు పగిలింది పింక్ డైమెండ్ కాదని, రుబీ (కెంపు) అని మాత్రమే తేలింది. ఉత్సవ మూర్తులను, గరుడ సేవ నిమిత్తం ఊరేగింపుగా తీసుకు వెళ్తున్న సమయంలో, కొంత మంది భక్తులు, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు స్వామి వారి పై coins వెయ్యటం వళ్ళ, ఆ రుబీ పగిలింది. డైమెండ్ అయితే అసలు పగలదు అనే విషయం అందరికీ తెలుసు. ఆ రుబీ కింద పాడినప్పుడు, ఆలయా ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు, అది గుర్తించారు.. దీంతో ఆ ప్రదేశంలో అందరూ వెతకగా, ఆ రుబీ ముక్కలు అయ్యి కనిపించిది. ఇదే విషయం అప్పట్లోనే తిరువాభరణం రిజిస్టర్ లో కూడా ఎంటర్ అయ్యింది. ఆ పగిలిన ముక్కలు ఇప్పటికీ టిటిడి వద్ద బద్రంగా ఉన్నాయి. ఆ పగిలిన కెంపు స్థానంలో, పగడం పెట్టారు. 1945లో మైసూర్ మహారాజా గారు, అది ఇచ్చినప్పుడు ఆ కెంపు విలువ 50 రూపాయలు ఉంది. ఇదే విషయం ఒక కేసు విషయంలో, హై కోర్ట్ కి కూడా టిటిడి చెప్పింది" అంటూ వాద్వా కమిటీ రిపోర్ట్ లో స్పష్టంగా పెర్కున్నారు... మరీ అన్నీ తెలిసిన రమణ దీక్షితులు గారు, ఎందుకు అబద్దాలు ఆడతున్నారో, ఆ వెంకన్న దయతో త్వరలోనే వాస్తవాలు బయటకు తెలియాలని కోరుకుందాం...