ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు... ఇక ప్రభుత్వ పాఠశాలల్లో బాత్రూంలు అయితే చెప్పే పనే లేదు.. కాని ఇప్పుడు పరిస్థితితులు మారిపోతున్నాయి... ప్రభుత్వ పాఠశాలల్లో మంచి వసతులు ఏర్పడుతున్నాయి. ప్రైవేటు స్కూల్స్ కి తగ్గట్టుగా, విద్యా ప్రమాణాలు మెరుగు పడుతున్నాయి... వర్చ్యువల్ క్లాసు రూమ్స్ అనే విప్లవం వచ్చింది. అంగన్ వాడీ కేంద్రాలు, ప్రీ స్కూళ్లుగా మారుతున్నాయి. విద్యార్ధుల నుంచి బయోమెట్రిక్ హాజరు వంటివి వచ్చాయి. ఈ క్రమమలో పాఠశాలల్లో వసతులు కూడా పెరుగుతున్నాయి...
మీరు చూస్తున్న ఈ వాష్ రూమ్లు, ఏ స్టార్ హోటల్ లో ఉన్నవో, లేక మల్టీప్లెక్స్ దియేటర్ లోదో కాదు, మన విజయవాడ పాఠశాలలో బాలికల టాయిలెట్స్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని 47 డివిజన్ , సత్యనారాయణపురo లోని A.K.T P ప్రబుత్వ పాటశాల లోనిది. ఆరు నెలల క్రితము విజయవాడ సెంట్రల్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మల్యే బోండా ఉమా ఈ పాఠశాలకు వచినప్పుడు బాలికలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలిపారు. ఆ బాలికల ఇబ్బందులకు చేలించిపోయిన బొండా ఉమా వెంటనే 10 లక్షలు మంజూరు చేయించి స్టార్ హోటళ్ల కు దీటుగా ఆ పాఠశాలలో వాష్ రూమ్స్ కట్టించారు...
విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, విజయవాడ మునిసిపల్ కమీషనర్, బొండా ఉమా ఆ వాష్ రూమ్స్ ప్రారంభించారు. ఇలాగే తన నియోజకవర్గ పరిధిలో పాఠశాలలకు ఉన్న ఇబ్బందులు గుర్తించి పని చేస్తున్నట్టు ఉమా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, పాఠశాలల్లో వసతులు మెరుగుపరచటానికి ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రకటించారని, దానికి అనుగుణంగా పని చేస్తున్నట్టు చెప్పారు. ఏది ఏమైనా ఇది మంచి ప్రయత్నం... అన్ని నియోజకవర్గల్లో ప్రజా ప్రతినిధులు, ఇలా ముందుకొచ్చి పనులు చెయ్యాలి... బాలికల ఆత్మ గౌరవం కాపాడాలి... ఇలాంటి మంచి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తారు..