ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నీరు విడుదల చేశారు. కృష్ణా డెల్టా తూర్పు ప్రధాన కాలువపై కొత్తగా నిర్మించిన నియంత్రిక ద్వారా సీఎం నీరు విడుదల చేసారు. దీనిద్వారా రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీరు బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు కాలువ ద్వారా విడుదల చేయనున్నారు. కృష్ణా కాలువలో ముఖ్యమంత్రి గంగపూజ నిర్వహించారు. గతేడాది కంటే వారం రోజుల ముందే కాలువలకు నీరు విడుదల చేసినట్లు తెలిపారు. కృష్ణా డెల్టా ఆధునీకరణ పనుల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. కృష్ణా తూర్పు డెల్టాలో 7.36లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

cbn 20062018 3

పశ్చిమ డెల్టా కాలువకు మరో రెండు రోజుల తర్వాత సాగునీరు విడుదల చేయనున్నారు. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది జీరో అవుట్ ప్లో ఉందని.. చరిత్రలో ఇలాంటి దారుణమైన పరిస్థితి తొలిసారని సీఎం వ్యాఖ్యానించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా నది ద్వారా బ్యారేజీకి నీరు రావడం లేదన్నారు. కృష్ణా నదిపై ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు పెరిగి కిందకు నీరు వచ్చే పరిస్థితి లేదని కొన్నేళ్లుగా కృష్ణా డెల్టాలో అదను తప్పి సాగు చేయాల్సిన పరిస్థితి ఎదురైందని.. పట్టిసీమ నిర్మాణం ద్వారా ఈ సమస్య అదిగమించామన్నారు. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా వచ్చిన నీటితో కాలువలకు నీరిస్తున్నామని... ముందుగా నీటి విడుదల వల్ల తుఫానులు రాకముందే పంట చేతికొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

cbn 20062018 4

రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నీరు అందించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని.. అభివృద్ధి ఫలాలు అందుకున్న వారు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చారు. దేశంలోనే నీటి నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఘనత సాధించిన ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసన సభాపతి మండలి బుద్దప్రసాద్, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read