హైదరాబాద్ ఉమ్మడి రాజధాని... హైదరాబాద్ లో ఎంతో మంది ఆంధ్రా ప్రాంతం వాళ్ళు ఉన్నారు... వారికి నీటి కేటాయింపుల్లో, ఆంధ్రప్రదేశ్ వాటా నుంచి నీళ్ళు ఇవ్వాలి అని తెలంగాణా ఇరిగేషన్ అధికారులు కృష్ణా బోర్డు ముందు వాదిస్తే, దానికి మన ఆంధ్రప్రదేశ్ అధికారులు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు... ఇప్పుడు మీకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయం గుర్తుకువచ్చిందా ? అయితే, మా ఆంధ్రా వాళ్ళు ఉంటున్నారు అంటున్నారుగా, హైదరాబాద్ ఆదాయంలో మాకూ వాటా ఇవ్వండి.. మీకు మేము నీళ్ళు ఇస్తాం అనగానే, తెలంగాణా అధికారులు షాక్ అయ్యి, ఆ ప్రతిపాదన విరమించుకున్నారు...
నీటి వాటాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రగులుతున్న వివాదానికి తెర దించింది కృష్ణా ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 511:299 నిష్పత్తి ప్రకారం ప్రస్తుతం ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలకు బోర్డు పంచింది. శనివారం జలసౌధాలో నీటి వాటాల కేటాయింపు బోర్డు ఇరు రాష్ట్రాల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించింది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ కు 217.8 టిఎంసీలు, తెలంగాణకు 112.2 టిఎంసీలను కేటాయించింది. ఈ నిర్ణయానికి ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం కృష్ణా బేసిన్లో మొత్తం 330 టి.ఎంసీల నీరుంది. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఏపికి 66 శాతం, తెలంగాణకు 34శాతం నీటిని కేటాయించినట్లు బోర్డు చైర్మన్ తెలిపారు.
ఇక పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలిమెట్రీ ట్యాంపరింగ్ ఆయిందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీంతో ఎక్కువ నీటిని ఏపి వాడుకున్నప్పటికి తక్కువ చూపిస్తోందని తెలిపింది. ఈ అన్యాయం పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆధికారులు పట్టుపట్టారు. దీనిపై స్పందించిన చైర్మన్ ఆది అవాస్తవమని చెప్పేసారు. పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన టెలిమెట్రీ ప్రయోగాత్మకమేనని, పూర్తి స్థాయిలో దాని ఏర్పాటు జరగలేదని చెప్పారు. అలాగే, హైదరాబాద్ ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని తెలంగాణ వాదించింది. హైదరాబాద్ కు అవసరమయ్యే నీటిని ఏపి, తెలంగాణల వాటాల నుంచి కేటాయించాలని కోరింది. ఏపి వాటాను కూడా హైదరాబాద్ కు పంపకం చేయాలని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ వాదనను సమర్ధవంతంగా తిప్పి కొట్టటంతో, తెలంగాణా అధికారులు ఆ వాదన పై వెనక్కి తగ్గారు...