నీటిని సంరక్షించాలి, పొదుపుగా వాడుకోవాలి అంటూ, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పే సూక్తులు, కేవలం ప్రచారం వరుకే పరిమితం అని తేలిపోయింది. నీటి సంరక్షణ, పొదుపు కోసం, మన రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటికి ముఖ్యంగా, కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్‌షెడ్ల పధకం నుంచి, ఎప్పటి నుంచో నిధులు వస్తున్నాయి. బీజేపీ లేక ముందు కూడా ఈ స్కీం ఉంది. అయితే, తాజగా, రాష్ట్రాల్లో అమలవుతున్న వాటర్‌షెడ్లకు కేంద్రప్రభుత్వం నిధులు ఆపేసింది. దీంతో నీటి సంరక్షణ, పొదుపు కోసం వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి. కొత్తగా మంజూరు అయిన ఆరో బ్యాచ్‌ వాటర్‌షెడ్లను సొంత నిధులతో నడుపుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

cm letter 19082018

దేశవ్యాప్తంగా వాటర్‌షెట్లను నిర్వహిస్తున్నా, ఈ పథకం మన రాష్ట్రంలోనే ఎక్కువగా సత్ఫలితాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం దెబ్బ ఏపీపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో వాటర్‌షెడ్ల పథకంలో పనిచేస్తున్న సిబ్బంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే పరిస్థితి లేకపోవడం, ఉన్న ప్రాజెక్టులకు కూడా నిధులు ఆగిపోవడంతో వీరిలో ఆందోళన ఎక్కువైంది. ప్రస్తుతం 790 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వాటర్‌షెడ్‌ పథకంలో పని చేస్తున్నారు. మొదట్లో ప్రారంభమైన ప్రాజెక్టులు 90 శాతం దాకా పూర్తయ్యాయి. దీంతో ఈ ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు మంజూరయితేనే వీరి పని ఉంటుంది. అయితే, తాము కొత్త పథకాలను కేటాయించబోవడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వీరిలో ఎక్కవమంది అభద్రతకు గురవుతున్నారు.

cm letter 19082018

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇప్పటికి ఆరు బ్యాచ్‌ల్లో వాటర్‌షెడ్లు మంజూరుచేసింది. 2009 నుంచి 2014-15 వరకు.. రూ.2,900 కోట్లతో 432 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఒకటో, రెండో తప్ప అన్నీ దాదాపు పూర్తి కావొస్తున్నాయి. అయితే కొత్తగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులను మంజూరుచేసేది లేదని, ఉపాధి హామీ పథకంలో భాగంగానే నీటి సంరక్షణ పనులూ చేపట్టాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అన్నీ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా మరికొన్ని వాటర్‌షెడ్లు నవ్యాంధ్రప్రదేశ్‌కు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినప్పటికీ, కేంద్ర మంత్రి నుంచి ఇదే సమాధానమొచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read