ఒక పక్క క-రో-నా తో ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయ్యింది. మరో పక్క లాక్ డౌన్. ఇక మన అప్పులు సంగతి సరే సరి. ఇక ఈ పరిస్థతిలో మనకు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. వేస్ అండ్ మీన్స్ పద్దు ద్వారా అదనంగా రూ.2,146 కోట్లు తీసుకునేందుకు రిజర్వు బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి సౌకర్యం ఇచ్చింది. అయితే ఈ డబ్బుని మొత్తం కో-వి-డ్ చర్యల కోసం, వ్యాక్సిన్ ల కోసం వాడాలని టిడిపి అంటుంది. టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, "వేస్ అండ్ మీన్స్ పద్దు ద్వారా అదనంగా రూ.2,146 కోట్లు తీసుకునేందుకు రిజర్వు బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి సౌకర్యం పొడిగించిందని వార్తలు వచ్చాయి. ఈ నిధులైనా కమిషన్ వచ్చే వాటికి కాకుండా క-రో-నా వ్యాక్సిన్ కొనుగోళ్లు, కరోనా బాధితుల కోసం ఖర్చు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆరోగ్య విపత్తు నిర్వహణకు నిధులు వెచ్చించాలని డిమాండ్ చేస్తున్నాను. రెండేళ్లలో సంక్షేమానికి రూ.87 వేల కోట్లు ఖర్చు చేశామని సీయం మరియు మంత్రులు పదేపదే చెబుతున్నారు. సెంటు పట్టా పేరుతో రూ.6,500 కోట్లు దోపిడీ చేశారు. దళిత, బడుగు వర్గాలకు చెందిన 10 వేల ఎకరాలు అసైన్‌మెంటు భూములు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్సు కొనుగోళ్లలో రూ.307 కోట్లు అవినీతికి పాల్పడ్డారు. ఇలా స్కీములన్నీ స్కాముల మయం చేశారు. అమ్మ ఒడికి రూ.14 వేలు ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా రూ.36 వేలు గుంజుకున్నారు. వాహనమిత్రకు రూ.10 వేలు ఇచ్చి జరిమానాలు, డీజిల్ రేట్లు పెంచి డ్రైవర్ల దగ్గర రూ.30 వేలు లాక్కుంటున్నారు. "
"రైతు భరోసాకు రూ.7,500 కోట్లు ఇచ్చి, అన్నదాత సుఖీభవలో వచ్చే రూ.15 వేలు రద్దు చేశారు. రైతు రుణమాఫీ రద్దు చేశారు. రెండున్నర లక్షల మందిని వాంటీర్లుగా నియమించి, 6 లక్షల మందికి ఇచ్చే నిరుద్యోగభృతి రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్‌ప్లాన్లు నిర్వీర్యం చేశారు. 56 బీసీ కార్పొరేషన్లు అని ఆశ పెట్టి, బీసీ రిజర్వేషన్లు కోతకోసి 6,800 పదవులు బీసీలకు దూరం చేశారు. ఇలా పావలా ఇచ్చి ముప్పావలా లాక్కొన్నారు. రెండేళ్లలోనే వేసిన పన్నుల ద్వారా, పెంచిన ధరల ద్వారా, తెచ్చిన అప్పుల ద్వారా ప్రతి కుటుంబంపై రూ.2.5 లక్షల భారం మోపారు. మీది మోసకారి సంక్షేమమేగానీ నిజమైన సంక్షేమం కాదు. తెలుగుదేశం రెండేళ్లలో సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చు చేసింది. పన్నులు పెంచలేదు. పైగా అభివృద్ధి చేసింది. రూ.5 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది తెలుగుదేశం. విపత్తులో వేగంగా స్పందించి ప్రజల్ని ఆదుకున్నది. ఇప్పటికైనా జగన్‌రెడ్డి సోది కట్టిపెట్టి వ్యాక్సిన్, ఆక్సిజన్‌పై దృష్టి కేంద్రీకరించి పనిచేయాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి." అని యనమల రామకృష్ణుడు అన్నారు