A2 విజయసాయి రెడ్డి ఏమో, మోడీ మీద విశ్వాసం ఉంది, కాన్ఫిడెన్సు ఉంది అంటూ, గట్టిగా బల్ల గుడ్డి, నేషనల్ మీడియాలో ఊదరగొడుతున్నాడు... A1 జగనే మో, కేంద్రం పై అవిశ్వాసం పెడుతున్నా, చంద్రబాబు కూడా రావాలి అంటూ ఛాలెంజ్ అంటాడు... ఇంతకీ ఏంటి ? మోడీ పై విశ్వాసమా ? మరి అవిశ్వాసం ఎందుకు ? రాజీనామాలు ఎందుకు ? ప్రజలు మరీ అంత బకరాలు లాగా కనిపిస్తున్నారా ? ఇలా అనుకుని, మీరే బకరాలు అయిపోతున్నారు అనే విషయం మర్చిపోతున్నారు... రాష్ట్ర ప్రయోజనాలని ఒక ప్రతి పక్ష పార్టీగా మంట గలిపి, కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం పాకులాడుతున్నారు...
తెలుగుదేశం మంత్రులు, కేంద్రం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి నేషనల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నారు.. తద్వారా బీజేపీ పెద్దల కళ్ళలో పడటానికి చూస్తున్నారు.... కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం లేదు, రాహుల్ గాంధీ మోసం చేస్తాడు అని చెప్తూ, స్పెషల్ స్టేటస్ ఇచ్చేది మోడీ మాత్రమే, ఆయన మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉందీ అంటూ, విజయసాయి రెడ్డి, నేషనల్ మీడియాలో ఊదరగొడుతున్నాడు... అంటే ఈయనకు పూర్తిగా మోడీ పై విశ్వాసం ఉంది అని చెప్తున్నారు...
మరో పక్క, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, చాలా తెలివిగా మాట్లాడుతూ మోడీని ఒక్క మాట కూడా అనకుండా, కేంద్రం పై అవిశ్వాసం పెడుతున్నా, చంద్రబాబు కూడా రావాలి అంటూ ఛాలెంజ్ అంటాడు... ఇన్ని రోజుల పోరాటంలో, ఒక్కసారి కూడా మోడీని ఒక్క మాట అన్న పాపాన పోలేదు వైసిపీ.. ఢిల్లీలో ధర్నా అంటూ, తెలుగులో ప్లె కార్డులు పట్టుకుని, హడావిడి చేసారు.. ఎక్కడా మోడీని కాని, అమిత్ షా ని కాని, ఒక్క మాట కూడా అనలేదు.. మోడీ పైనే మాకు విశ్వాసం అంటూ ఢిల్లీలో హడావిడి చేస్తూ, ఇక్కడ మాత్రం అవిశ్వాసం పెడుతున్నాం అంటూ డ్రామాలు ఆడుతున్నారు... వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అనే విషయం, ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు...