ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, ముసుగులు నెమ్మదిగా వీడుతున్నాయి... ఎవరు ఎటు వైపో, డైరెక్ట్ గా కాకపోయినా, ఇన్ డైరెక్ట్ గా అయినా ప్రజలకు అర్ధమవుతుంది. కాంగ్రెస్,బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ అని కెసిఆర్ చెప్తున్న మాటలు, అన్నీ అబద్ధమని ప్రతి రోజు జరుగుతున్న సంఘటనలు తెలియ చేస్తుంటే, ఇప్పుడు బీజేపీ కూడా అదే చెప్తుంది. తెలంగాణలో కాంగ్రె్‌సను, ఏపీలో టీడీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరు శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠితో మాట్లాడుతూ ఈ సంగతి తెలిపారు. ‘ఏపీలో ఎవరు గెలిచినా.. తెలుగుదేశం పార్టీని మాత్రం అధికారంలోకి రానివ్వం. తెలంగాణలో కాంగ్రె్‌సకు విజయం దక్కకుండా ఏమైనా చేస్తాం‘ అని తమ పార్టీ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ వెళ్లిపోవాలని బీజేపీ కూడా కోరుకుందని, తమకు చంద్రబాబు కావాలనుకుంటే అప్పుడే ఆపగలిగే వాళ్లమని ఆయన పేర్కొన్నారు.
ఏపీ రాజకీయాల్లో గేమ్ ఆడేందుకే రాష్ట్ర శాఖ పాత అధ్యక్షుడితో రాజీనామా చేయించి.. కొత్త అధ్యక్షుడిని తీసుకొచ్చామన్నారు. ఆ రాష్ట్రంలో రాజకీయ క్రీడకు సన్నద్ధమవుతున్నామని చెప్పారు. 2019 వరకు కాంగ్రెస్ లో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అనేకమంది నేతలు బీజేపీతో చేతులు కలుపుతారని, అక్కడ కాంగ్రెస్ పేరుతో మొక్క కూడా మొలవదని వారికి తెలుసునని చెప్పారు. ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా బీజేపీలో చేర్చుకుంటామని, టీడీపీ నుంచి కూడా పలువురు సంకేతాలు పంపిస్తున్నారని అన్నారు. 2019లో చంద్రబాబు శీర్షాసనం వేసినా ముఖ్యమంత్రి కారని, అప్పటికి ఏపీలో కొత్త అంశాలు తెరపైకి వస్తాయని జోస్యం చెప్పారు.
1984లో ఉమ్మడి ఏపీలో చోటుచేసుకున్న సంక్షోభమే 2019లోనూ పునరావృతం అవుతుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రె్‌సను అధికారంలోకి రాకుండా ఉండేందుకు అవసరమైన వ్యూహరచన చేస్తున్నామని బీజేపీ నేత చెప్పారు. అక్కడ బీజేపీ గెలవడమో, లేదా టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడమో జరగాలి తప్ప.. కాంగ్రె్‌సకు అధికారం దక్కకూడదనేదే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణలో టీఆర్‌ఎ్‌సను తిట్టకపోతేనే నష్టమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి యోచించడం సరైన వ్యూహమేనని వ్యాఖ్యానించారు. మొత్తానికి, ఈ నేత వ్యాఖ్యలతో, కెసిఆర్ చేత ఫెడరల్ ఫ్రంట్ అనే డ్రామా ఆడిస్తుంది మేమే అనే సంకేతాలు బీజేపీ ఇచ్చింది.