కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్న భాజపాపై అవిశ్వాసం పెట్టడం ద్వారా సాధించేదేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.ఉండవల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక అంశాలలో స్పష్టత ఇచ్చారు. అవిశ్వాసం పెట్టేందుకు 54మంది ఎంపీల మద్దతు కావాలి... అది ఒక్క రోజు చర్చతో ముగిసిపోతుంది.... పునర్విభజన చట్టం అమలును సమీక్షించాలని, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలును సమీక్షించాలని,ఆర్ధికమంత్రి ప్రకటించిన ప్రత్యేక ఆర్ధిక సాయం అమలుపై ఒక రోజంతా సుదీర్ఘ చర్చ జరగాలని బడ్జెట్ పెట్టిన మరుసటి రోజునుంచి టిడిపి ఎంపీలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చర్చించడమే అవిశ్వాసం వల్ల సాధించేది కూడా..టిడిపి అడుగుతోంది కూడా అదేకదా..?
జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగడుతూ కేంద్రం పై నిరంతర ఒత్తిడి పెంచితేనే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది.
పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు అంత గొడవ చేస్తుంటే సోనియా గాని, రాహుల్ గాని కనీసం నోరువిప్పి మాట్లాడలేదు. రాజ్యసభలో కేవిపి ప్లకార్డులు పట్టుకుంటే మాకు సంబంధం లేదు సస్పెండ్ చేసుకోండని ఆజాద్ అనడం ఆపార్టీ చిత్తశుద్దికి నిదర్శనం. వైకాపా చివరలో రాజీనామాలు చేస్తామనటం వల్ల ఉపయోగం లేదు...., చివరి ఏడాది కాబట్టి ఉపఎన్నికలు రావనే దుర్బుద్దితో వైకాపా రాజకీయాలు చేస్తోంది.
అందుకే అవిశ్వాసం ఆఖరి అస్త్రం కావలి... అవిశ్వాస తీర్మానం వల్ల వెంటనే ఏ ఫలితం రాదని, అందుకే దానిని ఆఖరి అస్త్రంగా వాడుకోవాలని అనుకొంటున్నామని చంద్రబాబు తెలిపారు. ‘అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన వల్ల పార్లమెంటులో చర్చ జరుగుతుంది. అంతవరకే ఫలితం... మళ్లీ ఆరు నెలల వరకూ ఆ అంశాన్ని లేవనెత్తలేం. రాజీనామాలు చేసి బయటకు వచ్చేసినా కేంద్రం ఊపిరి పీల్చుకొంటుంది. పార్లమెంటు జరిగినన్ని రోజులూ కేంద్రంపై ఒత్తిడి ఉండాలన్నది మన ఆలోచన. టీడీపీ ఎంపీల ఆందోళన వల్ల చర్చ జరుగుతోంది. కేంద్రంపై ఒత్తిడి ఏర్పడుతోంది. ఈ విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’’ అని చంద్రబాబు అన్నారు...