కేంద్ర ప్రబుత్వం దేశంలోని తూర్పు - దక్షిణం - పడమర మూడు వైపుల ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని పటిష్ట పరిచి, పారిశ్రామిక, పర్యాటక రంగాలలో దూసుకుపోయే విదంగా, "సాగరమాల ప్రాజెక్ట్ " ద్వార భారత దేశ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది... కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టును 12 లక్షల కోట్ల రూపాయలతో చేపడుతుంది. ఇందులో 4 లక్షల కోట్ల రూపాయలను రహదారుల నిర్మాణం వంటి సౌకర్యాల అభివృద్దికి, మిగిలిన 8 లక్షల కోట్ల రూపాయలతో దేశంలోని వివిధ పోర్టుల ఆధునీకరణ సహా, 27 ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన.

sagaramala 09032018 2

సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు లాభం ఏంటి ?: ఆంధ్రప్రదేశ్ కు తీరప్రాంతం 974 కి.మీలుతో, బారతదేశం లో రెండవ స్థానంలో ఉంది... అంటే ఎలా చూసుకున్నా, "సాగరమాల ప్రాజెక్ట్ " కేటాయింపుల్లో సింహ భాగం మన రాష్ట్రానికి రావాలి... దీంతో పాటు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విబజన చట్టంలో విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడారును అబివృద్ది పరచడానికి హామీ ఉంది... అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో, " విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడారును" కేంద్ర ప్రబుత్వం ప్రతిపాదించిన " సాగరమాల ప్రాజెక్ట్ " లో అంతర్బాగం కాబట్టి. ఆ ప్రాజెక్ట్ లోని అంశాలన్నీ ఏ విదంగా మిళితం చేసుకోవాలనే దాని పై 11-09-2015న, కేంద్రానికి నివేదిక ఇచ్చారు..

సాగరమాల ప్రాజెక్ట్ ప్రతిపాదించినప్పుడు కేంద్రం ఏమి చెప్పింది ?: సాగరమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ వద్ద కాకినాడ వద్ద 3000 కోట్ల రూపాయలతో ఎల్ అండ్ జి టెర్మినల్‌ను, మిగిలిన నిధులతో విశాఖలో అదనపు ఆయిల్ జెట్టీ, మరో స్టాక్ యార్డు నిర్మాణం, కాకినాడ వద్ద కోస్టల్ ఫుడ్ ఎక్స్‌పోర్టు బెర్త్ ఉన్నాయన్నారు. వాడ్రేవు, మచిలీపట్నం వద్ద కొత్తగా ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సాగరమాల ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో విశాఖ పోర్టు చాల కీలకమైనదని, దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు 2000 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.

sagaramala 09032018 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రతిపాదనలు పంపింది ?: ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రతిష్టాత్మికమైనదో, దీని ద్వారా రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసుకుని, స్వయంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సాగరమాల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ పోర్టులు, తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించి 30 వేల కోట్ల వ్యయంతో దాదాపుగా 20 ప్రాజెక్టులను రూపొందించింది. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. పోర్టుల ఆధునీకరణకు రూ. రూ330 కోట్లు , పోర్టులకు రైలు మార్గాల కోసం రూ. 8,810 కోట్లు, రోడ్డు మార్గాల అనుసంధానానికి రూ. 18, 503 కోట్లు, జాలరి కుటుంబాల అబివృద్ధికి రూ. 3,089 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఆ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే, కోస్తా తీర ప్రాంతంలో కొత్తగా 6 చేపల వేట హార్బర్‌లు వస్తాయి. దీనితో పాటు రాజధాని అమరావతి దగ్గర సరుకు రవాణా చేసే నౌకల హబ్‌, మచిలీపట్నం, విశాఖపట్నం, నెల్లూరు తదితర తీర ప్రాంతాల్లో సరుకుల రవాణాను పెంచటం ద్వారా రోడ్డు, రైలు మార్గాల్లో ట్రాఫిక్ వత్తిళ్లను తగ్గించవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచనగా వుంది. కోస్తా తీరం వెంబడి ప్రతి జిల్లాలో ట్రాక్ టెర్మినళ్లను నిర్మించాలని ప్రతిపాదించింది.

మరి కేంద్రం ఏమి చేసింది ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన అన్ని ప్రతిపాదనలను తిప్పి కొట్టింది... దానికి కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాధానం, హై పవర్ కమిటి ఒకటి వేసి, ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కావాలో మేమే తెలుసుకుంటాం అని చెప్పింది... Source:https://timesofindia.indiatimes.com/city/hyderabad/Setback-for-Andhra-Pradesh-Centre-not-to-fund-Sagaramala/articleshow/55060507.cms

గుజరాత్ కు లేని ఇబ్బంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎందుకు ? మనం పంపిన ప్రతిపాదనలు తిప్పి కొట్టింది కేంద్రం.. సరే అనుకున్నాం... కాని, కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రంలో కనిపించిన ఇబ్బందులు, గుజరాత్ లో మాత్రం కనపడలేదు... మే 22 2017న, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన దాని ప్రకారం " దేశం మొత్తం మీద సాగరమాల ప్రాజెక్ట్ కింద 1.37 లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి.. ఇందులో, లక్ష కోట్ల పనులు ఒక గుజరాత్ లోనే జరుగుతున్నాయి" అంటూ గర్వంగా, ప్రధాని సమక్షంలోనే ప్రకటించారు (https://www.thehindubusinessline.com/economy/logistics/port-development-key-to-nations-economic-prowess-says-pm/article9709859.ece).. అదే విషయం, ఇక్కడ స్వయంగా వినవచ్చు కూడా, https://youtu.be/Xn2mLHHBl24?t=312 ... ఏ రాష్ట్రంలో, ఏ పనులు జరుగుతున్నాయా అని సాగరమాల ప్రాజెక్ట్ వెబ్సైటు చుస్తే, పబ్లిక్ కి యాక్సెస్ లేదు http://sagarmalaprojects.gov.in/ .. ఎందుకు ఈ దాపరికం ?

దేశ ఆర్ధిక వ్యవస్థను మార్చే ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ లో, భారత దేశంలోనే, 974 కిమీతో, అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది, గుండు సున్నా... గుజరాత్ కి మాత్రం, లక్ష కోట్లతో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి... భారత దేశ ఎగుమతులలో, 90% దేశంలోని నౌఖాశ్రాయల ద్వారా జరుగుతుంది... ఆంధ్రప్రదేశ్ కు సుదీర్గమైన తీరప్రాంతం ఉన్నా, దాని ద్వార జరుగుతున్న వ్యాపారం చాల తక్కువగా ఉంది... దానికి కారణం సరైన మౌలిఖ సదుపాయాలూ లేకపోవడమే... మరి మాకు సాగరమాల ప్రాజెక్ట్ లో కేటాయింపులు ఎందుకు ఉండవు ? ఇది వివక్ష కాదా ? మేము కష్టపడతాం, దేశ అభివృద్ధికి తోడ్పాటు ఇస్తాం అనే మా ముఖ్యమంత్రి అభ్యర్ధనలు మీకు వినపడవా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read