సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పై నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటిలో నిర్ణయం తీసుకుంటే, ఇక అమలు జరిగిపోయినట్టే అనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. చివరకు అలాగే జరిగింది. అయితే, ఇదే సందర్భంలో, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం, ఆగష్టు 31, 2013న చంద్రబాబు పెట్టిన ఈ ప్రెస్ మీట్ వివారాలు, 5 సంవత్సరాల తరువాత ఇదే రోజు, ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, చంద్రబాబుని అందరూ విజనరీ అని ఎందుకు పిలుస్తారో అర్ధమవుతుంది. ఈ ప్రెస్ మీట్ సారంశం "తెలంగాణా ఇచ్చేసారు, మరి ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటి ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజాధాని లేదు. హైదరాబాద్ కు దీటైన రాజధాని ఆంధ్రాలో నిర్మించుకోవాలి. దానికి 5 లక్షల కోట్లు అవుతుంది" అని...
అప్పట్లో ఈ స్టేట్మెంట్ పై అందరూ ఎగతాళి చేసారు. అప్పటి కాంగ్రెస్ నాయకులు, వైసిపీ నాయకులు, తెరాస నాయకులు ఏంటో హేళనగా మాట్లాడారు. 5 లక్షల కోట్లు కావలి అంట అంటూ ఎగతాళి చేశారు. కాని ఇప్పుడు పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించండి. ఆంధ్రల కలల రాజధాని అమరావతి. ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం. సింగపూర్ సహకారం. లండన్ నుంచి డిజైన్ లు. హేమా హేమీ సంస్థలు రాక. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, కేంద్రం మాత్రం మనకు ఇచ్చింది, కేవలం 1500 కోట్లు. చంద్రబాబు హైదరాబాద్ కు దీటైన రాజధాని కావలి అంటే, ప్రధాని మోడీ వచ్చి, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తా అని మాట ఇచ్చి, చివరకు ఏమి చేసారో చూసాం. 5 కోట్ల ఆంధ్రులు, ఆ నిధులు కోసం పోరాడాల్సిన పరిస్థితి.
5 సంవత్సరాల క్రితం చంద్రబాబు చెప్పిన మాటలు " ఆంధ్రప్రదేశ్ లో మరో రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కు దీటైన రాజధాని కావలి అంటే, రాబోయే పది సంవత్సరాల్లో కనీసం 4-5లక్షల కోట్లు కేంద్రం సాయం చెయ్యాలి. ఎవరినీ అన్యాయం చెయ్యను అంటున్న కేంద్రం, అది మాటల్లో చెప్పి చూపించాలి. కొత్తగా ఏర్పడే రాష్ట్రము నిలదొక్కుకోవాలి అంటే ఆదాయం ఉండాలి. ఆదాయం ఉండాలి అంటే మంచి రాజధాని ఉంటేనే సాధ్యం. అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కంపెనీలు, పెద్ద విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, కేంద్ర సంస్థలు, పరిశ్రమలు రావాలి. నేను ఈ సమయంలో రాజకీయల్లోకి పోను, రెండు రాష్ట్రాలకు సమ న్యాయం చెయ్యండి. భరోసా ఇవ్వండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఎవరు బాధ్యులు ? అందుకే అన్నీ బిల్ లో పెట్టండి. నదీ జలాలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అన్నీ సీమంధ్ర ప్రజలకు ఉండేలా చూడండి" అంటూ చంద్రబాబు ఆ రోజు అన్నారు.
ఈ సమస్యలే ఇప్పుడు మనల్ని వెంటాడుతున్నాయి. అప్పట్లో హైటెక్ సిటీ కడుతుంటే, కంప్యూటర్ లు కూడు పెడతయ్యా అన్నారు, జరిగింది ఏంటో చరిత్ర. విభజన సమయంలో, ఆంధ్ర రాష్ట్ర రాజధానికి 5 లక్షల కోట్లు కావలి అంటే హేళన చేసారు, ఇప్పుడు జరుగుతుంది చుస్తే ఆయన మాటలు అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అమరావతి కడుతుంటే, బ్రమరావతి అని హేళన చేస్తున్నారు. ఇలాంటి వారికి చంద్రబాబు విలువ తెలియదు. చంద్రబాబు రెండు తరాల ముందు అలోచించి, ఇప్పటి నుంచే దానికి ప్రణాలికలు వేస్తారు. అప్పుడే అందరూ, చంద్రబాబు చెప్పిన 5 లక్షల కోట్ల ప్యాకేజీ కోసం, చట్టం తెచ్చుకుని ఉంటే, ఇప్పుడు ఈ బాధలు కొంత అయినా తీరేవి. చంద్రబాబు ఏదైనా ఆలోచన చెప్తే నవ్వుతాం, కాని కొన్ని రోజుల తరువాత అదే నిజం అయిన రోజు, మన అలోచేనే నవ్వులపాలు అవుతుంది. ఇప్పటికైనా,అందరం కలిసి పోరాడితే, కేంద్రం నుంచి ఏదన్నా సాధించుకునేది ఉంటుంది. చంద్రబాబుకు ప్రజల అండ ఉంటే చాలు, ఆయనే అన్నీ చూసుకుంటారు.