కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్రం పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. విభజన అంశా లేవీ బడ్జెట్ లో ప్రస్తావనకు రాలేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం నిర్మాణం, కడపలో ఉక్కు కర్మాగారం, భోగాపురంలో అంతర్జా తీయ విమానాశ్రయం, విజయవాడ, విశాఖపట్నంలో మెట్రోరై ళ్లతో పాటు జాతీయ సంస్థలనేకం మంజూరు కావాల్సి ఉంది. వీటితోపాటు రూ. 10వేల 200 కోట్ల రెవెన్యూ లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా కేంద్రమే అమలు చేయాలి. వీటిలో ఏదీ మచ్చుకైనా బడ్జెట్ లో చోటుచేసుకోక పోవటం రాష్ట్ర ప్రజల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రత్యేక హోదా అంశం ఎన్నికల్లో హామీకి, ప్రచారానికి మాత్రమే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హోదా అమలుపై గతంలో, జగన్ మోహన్ రెడ్డి పెద్దఎత్తున ఉద్యమాలు కూడా చ్జేసరి. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రా నికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ప్రచారం చేసారు. చంద్రబాబు వల్ల కాలేదని, తాను కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని, గెలిపించాలని కోరారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ నుంచి వైదొలగటంతో రాష్ట్రానికి విభజన హామీలు అమలుకాలేదని, తాము అధికా రంలోకి వస్తే హోదాతో పాటు అన్ని సాధిస్తామని వైసీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజ లకు భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి వీటి పై పెద్దగా శ్రద్ధ పెట్టింది లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించారు. అయితే రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. జగన్ మోహన్ రెడ్డి కాని, ఢిల్లీలో లాబయింగ్ చేసే విజయసాయి రెడ్డి కాని, 22 ఎంపీలు కాని, రాష్ట్రానికి నిధులు తేవటంలో, ప్రాజెక్టులు తేవటంలో ఘోరంగా విఫలం అయ్యారు. 22 మంది ఉన్నా, బలంగా కేంద్రం ముందు వాదించలేక పోయారు.

గతంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం హయాంలో రాజధాని నిర్మాణానికి రూ. 2500 కోట్లు మంజూరు చేసింది. ఎయిమ్స్ లాంటి కొన్ని జాతీయ సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. రాజధానికి కేటాయించిన రూ. 2500 కోట్ల నిధుల్లో వెయ్యి కోట్లు విజయవాడ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీకి కేటాయించినట్లు చెపుతున్నారు. దీంతో రాజధాని నిర్మాణానికి గత ఐదేళ్ల కాలంలో కేవలం రూ. 15 వందల కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 7 జిల్లాలకు రూ. 50 కోట్ల చొప్పున ప్రకటించిన వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ నిధులు కూడా రాష్ట్రానికి అందటం లేదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడలు వంచుతామని వైఎస్సార్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. పార్లమెంట్ లో 20మందికి పైగా సభ్యులు ఉంటే ఏదైనా సాధించగల మని ధీమాగా చెప్పింది. మూడు నెలల ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలిసేందుకు మూడు సార్లు ప్రయత్నించినా జగన్ కు అపాయింట్మెంట్ దొరకలేదు. బడ్జెట్ లో అయినా రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశించారు. అదీ నెరవేరలేదు. దీనికితోడు ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటంతో తాజా కేంద్ర బడ్జెట్లో అసలు రాజధాని ఊసే లేకుండా పోయిందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఇక పోలవరం సంగతి ఆ దేవుడికే తెలియాలి. మొత్తానికి 22 మంది + జగన్ + విజయసాయి రెడ్డి, కేంద్రం నుంచి సాధించింది సున్నా అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read