విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. డంబ్రీగూడ మండలం లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు గంట ముందు ఏం జరిగిందనే విషయానికొస్తే, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఈరోజు ఉదయం 11 గంటల వరకూ అరకులోనే ఉన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సివేరు సోమతో కలిసి నిమిటిపుట్టు గ్రామానికి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.

somu 23092018 2

అక్కడ గ్రామస్థులతో చర్చిస్తుండగా సుమారు 60 మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టారు. ఇటీవల చోటుచేసుకున్న పలు అంశాల పై వారు ఎమ్మెల్యేతో గంటసేపు చర్చించారు. ఎమ్మెల్యేకు చెందిన గూడ క్వారీపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్వారీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నందున మూసివేయాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. బెదింపులకు దిగడం సరికాదని వారించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోముకు తుపాకుల ఎక్కుపెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

somu 23092018 3

ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇరువురి గన్‌మెన్ల తుపాకులకు లాక్కున్నట్టు సమాచారం. అయితే, అయితే ఇటీవల కాలంలో వారు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారోత్సవాలు జరపడం, పోస్టర్లు ఏర్పాటుచేయడం వంటి చర్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు భద్రత లేకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లొద్దని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. ఈ క్రమంలోనే భద్రత లేకుండా గ్రామ పర్యటనకు వెళ్లిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు మావోయిస్టుల తూటాలకు బలయ్యారు. ఎమ్మెల్యే కిడారి పర్యటన పై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు కూడా చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read