ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు విచారణ నిన్న హైకోర్టులో జరిగిన విషయం తెలిసిందే. అమరావతిని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, అమరావతి రైతులు కోర్టుకు వెళ్ళారు. ఈ కేసు విషయం పై, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ నియమించింది. ఈ కేసు గతంలోనే విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, సెకండ్ వేవ్ కారణంగా, ఈ కేసు విచారణ ఆగష్టు 23కు కోర్టు వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే, నిన్న కేసు విచారణ ప్రారంభం కాగానే, రైతుల తరుపున వాదిస్తున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు, తమకు ఈ వారం వేరే కేసులు ఉన్నాయని, ఒక వారం పాటు వాయిదా వేయాలని కోరారు. అలాగే మరి కొంత మంది, ఇది ఆన్లైన్ లో విచారణ అయ్యేది కాదని, బౌతికంగా విచారణ జరపాలని కోరారు. అలాగే ప్రభుత్వం తరుపు ఆలోచన చెప్పాలని కోర్టు కోరటంతో, అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేసారు. దీంతో ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవటం, పిటీషనర్ తరుపు న్యాయవాదులు వాయిదా కోరటంతో, కోర్టు కూడా దీనికి అంగీకరిస్తూ, కేసు విచారణను వాయిదా వేసింది. ఈ కేసుని మళ్ళీ నవంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి ఇది కోర్టు నిర్ణయం కాదు, అందరూ ఒప్పుకున్నారు కాబట్టి, కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

botsa 24082021 2

అయితే కేసు వాయిదా వేయటం, అలాగే పిటీషనర్ లు వాయిదా కోరటం పై, మంత్రి బొత్సా ఆగ్రహం వ్యక్తం చేసారు. రోజు వారీ విచారణ చేస్తామని కోర్టు చెప్పిందని, ఇప్పుడు పిటీషనర్లు వాయిదా కోరటం ఏమిటి అంటూ ప్రశ్నించారు. దీని వెనుక పిటీషనర్లకు ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయి ఏమో అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే బొత్సా వ్యాఖ్యల పై ఘాటుగా బదులు ఇచ్చారు రాజధాని ప్రాంత రైతులు. నిజానికి నిన్న కోర్టులో, తాము వారం రోజులు వాయిదా వేయమని కోరామని, అయితే ఈ సందర్భంలో కల్పించుకున్న అడ్వకేట్ జనరల్ మాత్రం నవంబర్ వరకు వాయిదా కోరారని, అసలు విషయం చెప్పారు. ఇప్పుడు క-రో-నా నడుస్తుందని, అక్టోబర్ లో కోర్టుకు సెలవలు ఉంటాయి కాబట్టి, నవంబర్ నుంచి అయితే రోజు వారీ విచారణకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అడ్వకేట్ జనరల్ కోరారని అసలు విషయం చెప్పారు. విచారణ తొందరగా అయితే మాకే మంచిదని, బొత్సా తమ పై చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నామని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read