జగన్ చేసిన వ్యాఖ్యలు, టిడిపి నేతలు చేసి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేది ?.. సోషల్ మీడియాలో విపరీతింగా షేర్ అవుతున్న ఈ పోస్ట్ చూడండి... ఏదో అనుకుంటాం...కానీ..కొంత మందే...అటువంటి మాటలు మాట్లాడగలుగుతారు...? తరువాత ఆ మాటల నుంచి వచ్చే రియాక్షన్ తట్టుకోగలుగుతారు..? ఎంత ఛండాలంగా మాట్లాడినా...వెర్రిమూక..నెత్తిన పెట్టుకుంటుంది...ఆహో...ఓహా...మా వాడు..హీరో..అని పొగడ్తల వర్షం కురిపిస్తారు. అమ్మనా బూతులు తిట్టినా...వారి అభిమానం వారిదే...! ఇప్పుడు అచ్చం...'జగన్'లా...'పవన్‌కళ్యాణ్' కార్లు మార్చినట్లు..పెళ్లాలను మారుస్తాడని...'జగన్' అన్నా..కొందరికి..అది హీరోయిజంలా కనిపిస్తోంది. అదేమిటి..వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముందని..ప్రశ్నిస్తే...వ్యక్తిగత విషయాలే మున్నాయి..ఉన్నదే కదా..మాట్లాడాడని..సమర్థిస్తున్నారు. అతనికి అలానే కావాలని...భలే అయిందని..మరి కొందరు.. సంబరాలు చేస్తున్నారు. అయితే...ఇక్కడే..నాబోడి వాడికి కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఇదే కామెంట్లు...టిడిపి నేతలు ఎవరైనా చేస్తే..ఎలా ఉండేదో..ఒకసారి..ఊహించుకోండి...!?
'పవన్'పై ఇటువంటి వ్యాఖ్యలు కనుక..టిడిపి నేతలు ఎవరైనా చేసుంటే..ముందుగా..అధినేత చంద్రబాబుతోవారికి చివాట్లు పడేవి..తరువాత..ఆ వ్యాఖ్యలు చేసిన నేతలతో క్షమాపణ చెప్పించేవారు. 'ఆ మధ్య..ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సినీనటుల గురించి..ఏదో వ్యాఖ్య చేశారు..కదా..తరువాత..సినీనటులకు..ఆయన క్షమాపణ చెప్పారు గుర్తుందా..? అదే విధంగా..ఇప్పుడు కనుక టిడిపి నేతలు...ఇటువంటి కామెంట్లు చేసుంటే ఆ విధంగా జరిగేది. అధినేత చంద్రబాబు అటువంటి వ్యాఖ్యలు చేసిన నేతకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చి ఉండేవారు కాదు. సరే...పార్టీ సంగతి వదిలేద్దాం..మిగిలిన వారి సంగతికి వద్దాం.
ఇదే వ్యాఖ్యలు టిడిపి నేతలు చేసుంటే..అది తప్పని... సిపిఎం, సిపిఐ, బిజెపి,కాంగ్రెస్ నేతలు...ఖండనలపై ఖండనలు ఇచ్చేవారు. అంతేనా..టిడిపి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసేవారు. పార్టీల సంగతి..అలా ఉంటే...కాపు సంఘాలు, జనసైనికులు.. ధర్నాలు, బంద్‌లతో రాష్ట్రాన్ని హడలెత్తించేవారు. ఎక్కడికక్కడ...నగరాలు హోరెత్తిపోయి ఉండేవి. కానీ..ఇక్కడ 'జగన్' ఆ కామెంట్లు చేశాడు..కనుక..ఆయనపై ఎవరూ..నోరెత్తడం లేదు. ఎత్తితే ఏమవుతుందో...వారందరికీ తెలుసు కనుక...వారు నోరెత్తరు. ఆశ్చర్యకరంగా..తిట్టించుకున్న 'పవన్' కూడా నోరెత్తడం లేదు, ముగించమని ట్వీట్ కూడా చేసాడు. అదే టిడిపి నేతలు చేసుంటే..నా సత్తా చూపిస్తా..నేను నడిస్తే..సముద్రం నా వెంట నడుస్తుందంటూ..డైలాగ్‌లు చెప్పేవాడు.. లేదా...తనను చంపడానికి.. ఇటువంటివి చేస్తున్నారని..తుపాకులకు ఎదురు నిలబడతానని..సినిమా మాటలు చెప్పేవాడు..ఎంతైనా...'జగన్' పెట్టి పుట్టినోడు..? ఆయన ఎవరిని ఏమన్నా...ఎదురే లేదు...ముఖ్యమంత్రిని నడిరోడ్డులో ఉరితీయాలన్నా..బావిలో దూకి చావమన్నా...? ఆయనకు ఎదు రేముంది..? అంతా పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలం...! కొందరి జీవితాలు..అంతే...! అలా కలసి వస్తాయి.