మన రాష్ట్రంలో ఏడుపుగొట్టు గాళ్ళు ఎక్కువ... రాష్ట్రం నవ్వితే, వాళ్ళు ఏడుస్తారు... రాష్ట్రం ఏడిస్తే, వాళ్ళు నవ్వుతారు... ఇలాంటి వాళ్ళు, ఒకడికి ఇద్దరు తయారాయ్యారు... డయాఫ్రమ్‌వాల్ పూర్తయింది అనే సంతోషంలో ప్రజలు ఉంటే, అసలు ఆ డయాఫ్రమ్‌వాల్ ఎక్కడా అంటాడు ఒకడు... అదేమన్నా గొప్ప విషయమా అంటాడు ఇంకొకడు... అసలు, అదేంటో తెలుసుకోండి ముందు... డయాఫ్రమ్‌వాల్... ఇంటి నిర్మాణానికి పునాది ఎలాగో ప్రాజెక్టుకు డయాఫ్రమ్‌వాల్ అలాంటిది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత సంక్లిష్టతరమైన నిర్మాణం ఇది. ఎందుకంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉండే చోట నదీగర్భం నుంచి సీపేజ్ (లీకు) కాకూడదు. భవిష్యత్తులో భూకంపాలు వచ్చినా ప్రాజెక్టు తట్టుకోవాలి. అటువంటి డయాఫ్రమ్‌వాల్ నిర్మాణం పూర్తయ్యింది. చంద్రబాబు ఏ పని చేపట్టినా అది రికార్డు సృష్టించాల్సిందే.
మొత్తం 1396.60 మీటర్లు పొడవు,1.5 మీటర్లు వెడల్పు ఉండే ఈ డయాఫ్రమ్‌వాల్ నిర్మాణం కూడా 412 రోజుల్లో పూర్తయ్యింది. మొత్తం 1.18 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు. పోలవరం వద్ద నదీ గర్భం లోతు 40 మీటర్ల నుంచి 93.50 మీటర్లు ఉంటుంది. అక్కడివరకూ తవ్వుకుంటూ వెళ్ళి రాయి తగిలాక ఇంకో రెండుమీటర్లు తవ్వి అక్కడి నుండి కాంక్రీట్ వేసుకుంటూ వచ్చారు. దీనికి ప్లాస్టిక్ కాంక్రీట్ వాడడం మరో ముఖ్యాంశం. సిమెంటు, ఇసుక అందులో తక్కువ మోతాదులో కంకర వేసి బెంటోనైట్ మిశ్రమాన్ని కలపడాన్ని ప్లాస్టిక్ కాంక్రీట్‌గా వ్యవహరిస్తారు. 2017 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పనులను ప్రారంభించారు. తొలుత జులై 24 వరకు పని జరిగింది. ఆ తరువాత గోదావరిలో నీరు పెరగడం, వాతావరణం సహకరించక పోవడంతో పనులు నిలిపివేసి యంత్రాలను ఒడ్డుకు ఎక్కించారు.
వరదలు తగ్గిన తరువాత 2017 అక్టోబరు 9న ప్రారంభించి నవంబరు 15 వరకు పని చేశారు. అనివార్య కారణాల వలన మరో 5 రోజులు పనులు నిలిచిపోవడంతో నవంబరు 20న తిరిగి ప్రారంభించి 2018 జూన్ తొమ్మిది నాటికి మిగిలిన పనుల్ని పూర్తి చేశారు. ఇందుకోసం ఎల్అండ్టీ బావర్ కంపెనీతో ట్రాన్స్‌స్ట్రాయ్ గుత్తేదారు ఒప్పందం కుదుర్చుకున్నారు. పశ్చిమజర్మనీ నుంచి ఆధునిక యంత్ర పరికరాలు గ్రాబర్లు, కట్టర్లు, భారీ క్రేన్లు తెప్పించారు. ఆ దేశానికి చెందిన నిపుణులే పోలవరంలో మకాం వేసి పనులు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, చంద్రబాబు వంటి నాయకుడి సంకల్పం కలిసిరావడంతో అసాధ్యమనుకున్నది సుసాధ్యమైంది. చంద్రబాబు సత్తా ఏమిటో మరోసారి రుజువయ్యింది.