ఇవాళ రాష్ట్రమంతా ఒక వైపు పోతుంటే జగన్ ఎక్కడ దాక్కున్నారో ప్రతి ఒక్కరూ నిలదీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జగన్ చేసిందంతా డ్రామా అనేది ఇవాళ్టితో ప్రజలందరికీ అర్థం కావాలన్నారు. ప్రజలంతా మోదీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతుంటే జగన్‌ హైదరాబాద్‌లో దాక్కుని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. వైకాపా తప్ప అన్నిపార్టీలు నిరసనలు తెలుపుతున్నాయని, జగన్‌ భాజపాతో లాలూచీ పడ్డారని దుయ్యబట్టారు. మోదీ పర్యటనకు జగన్‌ సహకరిస్తున్నారనే విషయం ప్రతి గ్రామంలో తెలిసేలా చెయ్యాలని నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

moidi 09022019 2

రేపటి దిల్లీ దీక్షకు ప్రజలoదరి మద్దతు తీసుకోవాలని నేతలకు సూచించారు. మోదీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలన్నీ నాశనం చేశారని, అందుకే దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీకి నిరసనలు తప్పడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేసి మళ్లీ సెంటిమెంట్‌తో ఆడుకోవడానికి, మనల్ని ఎగతాళి చేయటానికే మోదీ వస్తున్నారని మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ వైకాపా వత్తాసు తీసుకుని మాట్లాడుతున్నారని, ఆయన భాజపాలో వైకాపా ఏజెంట్ అని విమర్శించారు. ర్యాలీలలో రెండు కుండలను పగులకొట్టాలని... ఒక కుండ నరేంద్రమోదీ, రెండో కుండ జగన్‌ మోహన్‌రెడ్డికని అన్నారు. ఆ రెండు కుండలు రెండు పార్టీల లాలూచీకి సంకేతమని చెప్పారు.

moidi 09022019 3

మరో పక్క లోకేష్ కూడా ఈ విషయం పై ట్విట్టర్ లో స్పందించారు... నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్‌ ఎక్కడ అని, వైసీపీ నాయకులు ఎక్కడంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా విపక్ష నేత జగన్‌పై పలు విమర్శలు చేశారు. తనపై ఉన్న 26 కేసులకు భయపడి జగన్ దాక్కున్నారా.., అరెస్ట్‌ చేసి జైలుకి పంపుతారు అని భయంపట్టుకుందా?, లేక లోటస్‌పాండ్‌లో పడుకున్నారా? అంటూ విమర్శించారు. అలాగే ఆంధ్రులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలకకపోగా మోదీతో జోడీకట్టిన జగన్‌, వైసీపీ కార్యకర్తలను మోదీ సభకు పంపుతున్నారని లోకేష్‌ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read