నాలుగు రోజుల సెలవలు తరువాత, రేపు పార్లమెంట్ మళ్ళీ ప్రారంభం కానుంది... గత 20 రోజుల నుంచి, వాయిదాలతో సాగుతన్న పార్లమెంట్, రేపు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ, ఢిల్లీ వర్గాలు లీకులు ఇస్తున్నాయి... పోయిన వారం కూడా, ఇలాగే లీకులు ఇచ్చారు... ఇది నిజమే అని అనుకుని, అన్ని పార్టీలు సభలో అవిశ్వాసం పై చర్చించటానికి రెడీ అయ్యాయి.. కాని, యధావిధిగా వాయిదాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు... ఈ రోజు మళ్ళీ, ఢిల్లీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి... ప్రభుత్వం అవిశ్వాసం పై చర్చకు సిద్ధంగా ఉందని, అన్నాడీయంకే ఎంపీలు ఆందోళన చెయ్యకుండా, బుజ్జగిస్తున్నారు అంటూ, లీకులు ఇస్తున్నాయి...

delhi 01042018

చర్చ జరపాలని ప్రభుత్వం కూడా నిర్ణయించుకుందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే సోమవారం లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ ఖాయంగా కనిపిస్తోంది. కాని వాస్తవం మాత్రం వేరేలా ఉందని, రాజకీయ విశ్లేక్షకులు అంటున్నారు... ఇప్పుడున్న పరిస్థితుల్లో అవిశ్వాసం పై చర్చకు వెళ్ళే ధైర్యం మోడీ చెయ్యరని అంటున్నారు... దానికి కారణాలు కూడా చెప్తున్నారు... టీడీపీ, వైసీపీ ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. ప్రాంతీయ పార్టీలు కావడంతో కేంద్రం పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఎం పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత ఆలోచనలో పడింది. ఒకవేళ అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చ జరిగితే ప్రధాన పార్టీలు దేశంలోని అనేక సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉంది. వ్యాపారవేత్త నీరవ్‌ మోదీ స్కాం.. ఇతర అంశాలు చర్చకు వస్తాయి. నోట్ల రద్దు నుంచి సీబీఎస్‌ఈ పేపర్ లీక్ వరకు అనేక సమస్యలు ప్రస్తుతం దేశంలో ఉన్నాయి.

delhi 01042018

వీటన్నింటినీ చర్చించాల్సి వస్తే ప్రభుత్వ వైఫల్యాలన్నీ బయటకు వస్తాయి. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని బీజేపీ భావిస్తే మాత్రం చర్చకు వెనుకడుగు వేయెచ్చు అని అంటున్నారు.. మరో పక్క, బీజేపీ ఎంపీలు కొంతమంది ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్లను తొలగించేందుకు పార్టీలో చర్చ జరుగతుందని ఆరోపిస్తూ యూపీకి చెందిన సావిత్రి భాయి అనే ఎంపీ తిరుగుబాటు చేశారు. మరోవైపు మోదీ తీరుపై ఆగ్రహంతో ఉన్న సీనియర్ నేతలు శతృఘ్నసిన్హా, అరుణ్‌శౌరి, జశ్వంత్ సింగ్ లాంటి నేతలు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో చర్చలు జరిపారు. దీంతో ఓటింగ్ జరిగితే పరువు పోతుందనే ఉద్దేశంలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read