క-రో-నాతో భారత దేశం విలవిల లాడుతుంది. ఈ నేపధ్యంలోనే లాక్‍డౌన్ దిశగా పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. అలాగే పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేస్తున్నారు. మాల్స్, సినిమాహాళ్లు కూడా ఎక్కడికక్కడ మూసివేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఆరు రోజులు లాక్‍డౌన్ ప్రకటించారు. రాజస్థాన్‍లో 15 రోజులు లాక్‍డౌన్ ను ఆ ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో ఏడు రోజులు లాక్‌డౌన్ ప్రకటించారు. తమిళనాడులో ప్రతి ఆదివారం లాక్‍డౌన్ విధిస్తూ, అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జమ్ము-కశ్మీర్‍లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. హర్యానాలో కూడా నైట్ కర్ఫ్యూ పెట్టారు. ఇక ఉత్తరప్రదేశ్‍లో కూడా నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  బిహార్‌, పంజాబ్‍, గుజరాత్‌, కర్నాటక, ఉత్తరాఖండ్, ఛండీగడ్‍, అండమాన్ నికోబార్‍లో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు. కర్నాటక కూడా లాక్‍డౌన్ దిశగా వెళ్తుంది. ఇక్కడ ఛత్తీస్ గఢ్‍లో 17 జిల్లాల్లో లాక్‍డౌన్ విధించారు.  తెలంగాణలో పెరుగుతున్న క-రో-నా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలోనూ క-రో-నా విజృంభిస్తుంది. ఏపీలోని విద్యాసంస్థల్లో క-రో-నా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం లాక్ డౌన్ విషయంలో తీసుకోలేదు. ఈ  రోజు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేదాని పై  చూడాల్సి ఉంది? - భారత్‍లో క-రో-నా కేసులు పెరగడంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు చేసుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read