రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన సెలెక్ట్ కమిటీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం గవర్నర్ చెంతకు చేరడంతో ఆయన తీసుకునే నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. దీనికి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే, అధికార పక్షమైన వైకాపా అభివృద్ధి వికేంద్రీకరణ సీఆర్డీయే చట్టం ఉపసంహరణ బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించుకోగా, మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ కౌన్సిల్ చైర్మన్ ఎంఏ షరీఫ్ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తూ చైర్మన్ ప్రకటించి నెలరోజులు కావస్తున్నా ఈ వ్యవహారం ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. ఈ నెలరోజుల సమయంలో మండలి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సెలెక్ట్ కమిటీ వేసేందుకు విపక్ష తెదేపా, అడ్డుకునేందుకు అధికార వైకాపా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. సెలెక్ట్ సమస్య చివరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరింది. గవర్నర్ తీసుకునే నిర్ణయంపైనే సెలెక్ట్ కమిటీ మనుగడ ఆధారపడి ఉంది. గతంలో సెలెక్ట్ కమిటీ వ్యవహారం తెదేపా, వైకాపా మధ్య మాటల యుద్ధం జరగ్గా, తరువాత ఉద్యోగుల సమస్యగా మారింది. నిబంధనలకు అనుగుణంగా లేదని అసెంబ్లీ కార్యదర్శి సెలెక్ట్ కమిటీకి సంబంధించిన ఫైల్‌ను రెండు సార్లు తిప్పి పంపడం చైర్మకు ఆగ్రహా న్ని తెప్పించింది.
ఒక సభ స్పీకర్ విచక్షణాధికారాన్ని, ఒక అధికారి ఎలా నియంత్రిస్తారు అంటూ, షరీఫ్ ఆగ్రహానికి లోనయ్యారు. తెలుగుదేశం పార్టీ కూడా, ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అవ కాశం ఉందని, స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు కూడా కలుగచేసుకోవు అని, అలాంటిది ప్రభుత్వం, ఇప్పుడు ఒక ఉద్యోగి చేత సభనే ధిక్కరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. సెలెక్ట్ కమిటీ నియమించాలని సభలో తాము తీసుకున్న నిర్ణయమని చైర్మన్ చె ప్పినా, కార్యదర్శి రెండు సార్లు ఫైల్ వెనక్కు తిప్పి పంపించారు. ఈ అంశంలో ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు సెలెక్టు కమిటీ ఏర్పాటు కాకుండా తన ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మనీ బిల్లులకు, సాధారణ బిల్లులకు వ్యత్యాసం ఉంటుం దని, ఈ రెండు బిల్లులు మనీ బిల్లులు కావన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి షరీఫ్ తెచ్చారు. మనీ బిల్లులకు వర్తించే నిబంధనలను ఈ బిల్లులకు సాకుగా చూపుతూ మండలి కార్యదర్శి వెనక్కి పంపారని, ఇది పూర్తిగా సభ గౌరవాన్ని మంటగలపటమేనని చెప్పారు.
కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికి రెండుసార్లు తాను ఆదేశాలు ఇచ్చానని, అయితే మండలి కార్యదర్శి వీటిని వెనక్కి తిప్పి పంపారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరించని అసెంబ్లీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని మండలి చైర్మన్ కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయేరద్దు బిల్లులపై మండలిలో జరిగిన చర్చ అనంతరం పరిణామాలలో తన విచక్షణాధికారాలతో సెలెక్ట్ కమిటీకి పంపిన విషయాన్ని గవర్నర్‌కు చైర్మన్ షరీఫ్ వివరించారు. మండలి కార్యదర్శితో పాటు మరో అధికారిపై కూడా మండలి ఛైర్మన్, గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తేదీలతో సహా వీళ్లు చేసిన పనిని, సవివరంగా గవర్నర్‌కు వివరించి, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చైర్మనను కోరటం సంచలనంగా మారింది. అయితే ఏకంగా చైర్మన్ వెళ్లి తన నిస్సహాయతను గవర్నర్‌కు చెప్పడం చర్చనీ యాంశంగా మారింది. ఇది అతి పెద్ద రాజ్యాంగ సంక్షోభం వైపు వెళ్ళే అవకాశం ఉందని, చైర్మన్ చెప్పినట్టు నడుచుకోవాల్సిందిగా గవర్నర్ కోరే అవకాశం ఉందని, వార్తలు వ్పాయి. గవర్నర్ కనుక ఆ నిర్ణయం తీసుకుంటే, ప్రభుత్వం ఇరకాటం లో పడే అవకాశం ఉంది. ఈ తరుణంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.