నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆర్డినెన్స్ తేవటం తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసి నిమ్మగడ్డను ఎన్నికల కమిషనరుగా తొలిగించింది. ఈ వ్యవహారంలో నిమ్మగడ్డతో పాటుగా, మాజీ మంత్రి బిజెపి నేత కామినేని శ్రీనివాసరావుతో సహా పలువురు ఏపీ హైకోర్టులో ఫిర్యాదు చేసారు. దీనిపై హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. నిమ్మగడ్డనే ఎస్ఈసీగా కొనసాగింపచేయాలని ఆదే శించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. రమేష్ కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వ పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోట్టే, న్యాయమూర్తులు జస్టిస్ ఎ. ఎస్. బోప్పన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వ తరుపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిణీ, రాకేశ్ ద్వివేది వాదనలు ధర్మాసనానికి వినిపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ తరుపు న్యాయవాదులు కోరారు. దీనిపై సు ప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాజే స్పందిస్తూ, రాజ్యాంగ పదవిలో వున్నవారిని ఎలా తొలిగిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం.
ఇలాంటి వ్యవహారాలు మంచివి కావని ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యా ఖ్యలు చేసినట్లుగా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రతి వాదులకు నోటీసులు ఇచ్చి, రెండు వారాల తరువాత మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రతివాదులు అనేకమంది ఉన్నారని, వారందరికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. అయితే ఈ వ్యవహారం పై నిమ్మగడ్డ ఎలా వ్యవహరిస్తున్నారు అనే దాని పై ఆసక్తి నెలకొంది. సుప్రీం స్టే ఇవ్వకపోవటంతో, హైకోర్టు తీర్పు ప్రకారం, ఆయనే ఇప్పుడు ఎలక్షన్ కమీషనర్. దీంతో గవర్నర్ కు జరిగిన విషయం మొత్తం చెప్పి, మళ్ళీ విధుల్లో చేరే అంశం పై, నిమ్మగడ్డ ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీని పై న్యాయ నిపుణలతో చర్చిస్తున్నారు. ఎలక్షన్ కమీషనర్ ను నియమించేది గవర్నరే కాబట్టి, ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ప్రమేయం ఉండదు కాబట్టి, గవర్నర్ వద్దకు వెళ్లి, ఆయనకు ఒక మాట చెప్పి, హైకోర్ట్ తీర్పు ప్రకారం, మరోసారి ఎన్నికల కమీషనర్ గా విధుల్లో చేరనున్నట్టు తెలుస్తుంది.