నరేంద్రమోడీ ప్రభుత్వం పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు చర్చ జరగనుంది. ఉదయం 11గంటలకు లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. అవిశ్వాస తీర్మానానికి తొలుత నోటీసు ఇచ్చిన టీడీపీకి మొదటగా చర్చను ప్రారం భించే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ చర్చ ఉదయం 11 గంటల నుంచి 6 గంటల వరకు మొత్తం ఏడుగంటల సమయం కేటాయించారు. అయితే ఎంపీలు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున సమయం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చర్చకు సమాధానమిస్తారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ నేపథ్యం లో తమ ఎంపీలకు ఆయా రాజకీయ పార్టీలు విప్ జారీ చేశాయి. పార్టీ ఎంపీలంతా విధిగా లోక్‌సభకు హాజరుకావాలని పేర్కొన్నాయి.
ఎన్‌డీఏ భాగస్వా మ్య పార్టీ శివసేన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని విప్ జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేయాలని విప్ జారీచేసింది. టిఆర్‌ఎస్ పార్టీ తమ వైఖరిని సభలోనే వెల్లడిస్తామని పేర్కొంది. అన్నాడిఎంకె అవిశ్వాసానికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని తమిళనాడు సీఎం పళనిస్వా మి స్పష్టం చేశారు. బిజూ జనతాదళ్ ఇంకా తన వైఖరిని వెల్లడించలేదు. సీపీఎం, ఎన్‌సీపీ, సమాజ్‌వా దీ, ఆర్జెడి, ఆర్‌ఎస్‌ఫి , డీఎంకే, ఎంఐఎం తదితర యూపీఏ పార్టీలు అవిశ్వాసానికి మద్దతుగా నిలబడ నున్నాయి. ఎంపీలందరూ సభకు హాజరయ్యేలా చూసేందుకు బీజేపీ ఎంపీలందరికీ పార్లమెం టులోనే ప్రత్యేకంగా భోజన సౌకర్యం ఏర్పాటు చేసింది.
అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ గట్టి కసరత్తు చేస్తోంది. ఆ పార్టీకి మాట్లాడేందుకు మూడున్నర గంటల సమయం దక్కడంతో ప్రతిపక్షాల వాదనను తిప్పికొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఆ పార్టీ నుంచి సుమారు 14 నుంచి 16 మం ది సభ్యులు మాట్లాడే అవకాశముందని తెలుస్తోంది. అందరూ కాంగ్రెస్ పైనే దాడి ఎక్కుపెడతారు. ఈ మేరకు ఆయా ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని చేరవేసింది. ఏపికి సంబంధించి, విభజన చట్టంలో తాము 85 శా తం అంశాలను అమలు చేశామని అదే విషయాన్ని సభలో చెప్తాం అంటున్నారు. ఇక్కడ జీవీఎల్ లాంటి నేతలు ఎలా మాట్లాడుతున్నారో, పార్లమెంట్ లో కూడా అదే చెప్తారు. అంటే, మన ఏపి విషయం పై గట్టిగా ఒక పది నిమషాలు మాట్లడతారు. అన్నీ ఇచ్చేసాం అంటారు. పెండింగ్ లో ఉన్నవి త్వరలో ఇస్తున్నాం అంటారు. చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు అంటారు. మోడీ, ఏపి విషయంలో ఇంతకు మించి ఏమి చెప్పలేరు. ఒక ఎమోషనల్ డ్రామా నడుపుతారు. మిగతా అంతా కాంగ్రెస్ పై దాడి చెయ్యటమే. బీజేపీకి ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో వాళ్లకి దిక్కు లేదు కాబట్టి, ఇంతకు మించి మన రాష్ట్రం గురించి ఏమి చెప్పరు.