జూన్ 2019 వరకు, అమరావతి ఒక అతి పెద్ద నిర్మాణాల ఆక్టివిటీ జరుగుతున్న ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపుగా 40 వేల మంది కార్మికులు, వారి నివాసాలు, వారి అవసరాలు కోసం పెట్టే సంతలతో, అమరావతి కళకళలాడుతూ ఉండేది. ఏ మూల చూసినా ఎదో ఒక నిర్మాణం జరుగుతూనే ఉండేది. అవన్నీ చూసిన రాష్ట్ర ప్రజలు, మనకు ఒక మంచి రాజధాని వస్తుందని మురిసిపోయారు. భూములు ఇచ్చిన రైతులు, తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశ పడ్డారు. జూన్ 2019న ప్రభుత్వం మారింది, ఇక అంతే అప్పటి నుంచి అమరావతి ఒక నిశ్శబ్ద నగరంగా మారిపోయింది. పునాదులు కోసం తవ్విన గోతులు, మొండి గోడలు, సగం తవ్విన రోడ్డులు, సగంలో ఉన్న నిర్మాణాలు వెక్కిరిస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వం, ఏదో ఒక రోజు, నిర్మాణం మళ్ళీ మొదలు పెట్టక పోతుందా అనే ఆశతో అక్కడ ప్రజలు ఎదురు చేసారు. కానీ వారి ఆశలు, నిరసలు అయ్యాయి. స్వార్ధ రాజకీయాలకు అమరావతి బలి అయి పోయింది.
అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో ఉన్నా, శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించినా, అవేమీ పట్టించుకోకుండా, బిల్లు ఆమోదించుకున్నారు. ఇక నుంచి అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమే. అసెంబ్లీ జరిగే సమయంలో మాత్రమే అమరావతి రాజధాని. అది కూడా అన్ని అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే జరుగుతాయి అనే గ్యారంటీ లేదు. గట్టిగా ఒక 20-30 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరుగుతాయి. అయితే ఇప్పుడు ఉన్న ప్రశ్న. అమరావతి భవిష్యత్తు ఏమిటి ? భూములు ఇచ్చిన రైతులు పరిస్థితి ఏమిటి ? ఇప్పటికే అక్కడ రోడ్డులు వేసారు, నిర్మాణాలు సగంలో ఉన్నాయి, అవి దేనికీ ఉపయోగపడవు. మరి రైతులని ఏమి చేస్తారు ? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. 90 శాతం పూర్తయిన భవనాలు ఏమి చేస్తారు, అనేదాని పై క్లారిటీ లేదు. ఇప్పటికే రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టారు. ఆ సొమ్ము అంతా నిరుపయోగమేనా ? కోర్టులు ఏమి చెప్తాయి. ఇవన్నీ సమాధనం ప్రశ్నలుగా ఉన్నాయి. వీటికి సమాధానాలు, ఎప్పటికి దొరుకుతాయో మరి.